బిజీ బ్యాచిలర్‌ | Nithin is the hero of Venni Kudu Mula directed by Bhishma | Sakshi
Sakshi News home page

బిజీ బ్యాచిలర్‌

Published Sun, Feb 10 2019 1:32 AM | Last Updated on Sun, Feb 10 2019 1:32 AM

Nithin is the hero of Venni Kudu Mula directed by Bhishma - Sakshi

భుజం గాయం కారణంగా కొన్ని నెలలుగా కెమెరా ముందుకు వెళ్లని నితిన్‌ మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘భీష్మా’ ది బ్యాచిలర్‌ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షుటింగ్‌ను ఈ నెల 25న స్టార్ట్‌ చేయనున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్‌. ‘ఛలో’ తరహాలోనే ఈ ‘భీష్మా’ కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్లాన్‌ చేశారట. ఈ సినిమానే కాకుండా ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించనున్న ఓ సినిమాను అంగీకరించారు నితిన్‌. ఈ రెండు సినిమాలతో నితిన్‌ ఈ ఏడాది బిజీ బిజీగా ఉండబోతున్నారు. ‘భీష్మ’ సినిమాకు సాగర్‌ మహతి సంగీత దర్శకుడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement