సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం(సెప్టెంబర్21)సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్, ఉప్పల్,బోడుప్పల్,నాగోల్,దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి,కోఠి,అబిడ్స్,నాంపల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా రెండుగంటల పాటు అతి భారీ వర్షం పడింది.
#HYDTPinfo
It's #Raining heavily.
Commuters are requested to drive carefully.#HyderabadRains pic.twitter.com/2tKy5y1vg9— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024
భారీ వర్షంతో రోడ్లపై నీరు వరదలై పారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌జామ్ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇదీ చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే
Comments
Please login to add a commentAdd a comment