
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడక్కడ పిడుగులు పడటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే పీక్ అవర్స్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, ఖైరతాబాద్, అమీర్ పేట,కోఠీ,అబిడ్స్, చాదర్‌ఘాట్, లక్డీకపూల్, ప్యాట్నీ, సికింద్రాబాద్, ఉప్పల్‌లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. (చదవండి : హైదరాబాద్‌లో భారీ వర్షం)
అడుగు తీసి అడుగు వేయలేనంతగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.ఇక నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఈ విధంగా ఉంది. ఖైరతాబాద్‌లో 10.5 సెం.మీ, బంజారాహిల్స్‌లో 9.8 సెం.మీ, జూబ్లీహిల్స్‌లో 9 సెం.మీ, నాంపల్లిలో 8 సెం.మీ సికింద్రాబాద్, చార్మినార్‌లో 6 సెం.మీ, ముషీరాబాద్‌లో 5 సెం.మీ,అంబర్‌పేట, రాజేంద్రనగర్‌లో 4 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment