
హైదరాబాద్: నగరం మరోసారి వర్షంతో తడిసి ముద్దయ్యింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత భారీగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,నాంపల్లి, ఖైరతాబాద్‌లతో పాటు పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమ్యారు. భారీగా వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతా ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment