సాక్షి, హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంక్ ఉన్న ఐదు అంతస్థుల మహవీర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహవీర్ హౌస్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని, ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రమాద కారణంగా బషీర్‌బాగ్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు హైదర్‌గూడ నుంచి కింగ్ కోటి మీదుగా వాహనాలను తరలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నగరంలో భారీ ట్రాఫిక్: గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. నగరమంతా వర్ష భీభత్సానికి తడిసిముద్దయ్యింది. అంబర్‌పేటలో 4.8 సెంటీ మీటర్లు, హిమయత్ నగర్‌లో 4.2 సెంటీ మీటర్లు, నాంపల్లి, ఖైరతాబాద్‌లో 4.1 సెంటీ మీటర్లు, మల్కాజ్‌గిరి, గోల్కొండలో 3.5 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. దీంతో ఓ పక్క వర్షపు నీరు నిలబడటం, మరో పక్క మెట్రోరైలు పనుల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment