బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఎయిరిండియా విమానం.. భారీగా ట్రాఫిక్‌జామ్‌ | Viral Video: Plane Gets Stuck Under Bridge In Bihar - Sakshi
Sakshi News home page

Viral Video: బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఎయిరిండియా విమానం.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

Published Sat, Dec 30 2023 12:51 PM | Last Updated on Sat, Dec 30 2023 1:09 PM

Plane Gets Stuck Under Bridge In Bihar Video Viral - Sakshi

విడ్డూరమైన ఘటనలకు కేరాఫ్‌ అయిన బీహార్‌లో ఓ విచిత్రమైన ఘటన.. 

Airplane Viral Video: బీహార్‌లో నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. మోతీహరి ప్రజలు సరికొత్త అనుభూతిని ఎదుర్కొన్నారు . నడిరోడ్డుపై ఎయిరిండియా విమానం సందడి చేసింది. అయితే ఓ బ్రిడ్జి కింద అది ఇరుక్కుపోవడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడగా.. కొందరు మాత్రం తమ ఫోన్‌లకు పని చెప్పారు.   

అయితే అదేం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న విమానం కాదు. కాలపరిమితి ముగిసి.. పాడైపోయిన ఎయిరిండియా ఏ320 విమానం.  ఆ భారీ విమానాన్ని ముంబై నుంచి అసోంకు ఓ ట్రక్కులో తరలించే యత్నం చేశారు. అయితే మోతీహరి పిప్రాకోటి ప్రాంతానికి చేరుకున్నాక.. అక్కడి ఓవర్‌ బ్రిడ్జి కింద ఆ విమానంతో కూడిన ట్రక్కు దాటేందుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రక్కు డ్రైవర్‌ పొరపాటు వల్లే ట్రాఫిక్‌ విఘాతం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 



పోయిన నెలలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తాహౌస్’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. దీంతో.. విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement