హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం | Heavy rainfall in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Oct 20 2019 3:49 PM | Updated on Mar 21 2024 8:31 PM

ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, మోహదీపట్నం, టోలీచౌకీ, ఆసిఫ్‌ నగర్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, కోఠీ, అబిడ్స్‌, బేగం బజార్‌, మలక్‌పేట, ఖైరతాబాద్‌ అమీర్‌పేట, పంజాగుట్టలో కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు చేసింది. మరోవైపు భారీ వర్షంతో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా  రుతువపనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement