
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు శనివారం ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వీహెచ్.. తానే దగ్గరుండి దాన్ని క్లియర్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని తల్లంపాడులో చోటు చేసుకుంది. ఖమ్మంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తు చేపడుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు హీహెచ్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా తల్లంపాడులో ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో వీహెచ్ తానే స్వయంగా దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
‘‘బాబు అటు పోయేది లేదు.. ఇటు వెళ్లండి’’ అంటూ సూచనలు చేయడమే కాక.. రోడ్డు మీద వెళ్తున్న వారిని ‘‘నమస్తే సార్’’ అంటూ పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రేపు ఖమ్మం నగరంలో జరుగున్న కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశంలో కూడా వీహెచ్ పాల్గోననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment