
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యంత వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం నుంచి కారు డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకూ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.