
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో తాత్కాలిక మార్కెట్ నిలిపివేయడంతో బుధవారం రైతులు రోడ్డెక్కారు. అంతేగాకుండా అంతకుముందు ఉన్న మార్కెట్ యార్డుకు తాళం వేసి కూరగాయలు అమ్మనివ్వక పోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై ఉదయం 5 గంటల నుంచి బైఠాయింపు చేస్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇన్నాళ్ళూ లాక్‌డౌన్ వేళ కామారెడ్డిలో మొత్తం 4 తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేశారు. అయితే సిరిసిల్ల రోడ్డు బీట్ బంద్ చేయడంపై అన్నదాతలు నిరసన తెలుపుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. (వారంతా రోడ్లపై ఎందుకున్నారు)
Comments
Please login to add a commentAdd a comment