
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు నవపాన్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఓ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోయిన పలువురు అభ్యర్థులు పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీ క్యాంపస్‌లోని జూనియర్ లెక్చరర్ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయారు.
ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ గంట ముందే పరీక్ష కేంద్రానికి పటాన్‌చెరు నుంచి బయలుదేరామని, ట్రాఫిక్ జామ్ కారణంగా 12 మంది అభ్యర్థులు 2 నుంచి ఐదు నిమిషాలు, మరో 18 మంది అభ్యర్థులు 10 నిమిషాలు ఆలస్యంగా కేంద్రానికి వచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష నోటిఫికేషన్ వచ్చిందని, ట్రాఫిక్ జామ్ కారణంగా పరీక్ష రాయలేకపోయామని రోదిస్తూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment