ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: విశాఖపట్నం పర్యటనలో ట్రాఫిక్ జామ్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు.
(చదవండి: సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు )
Comments
Please login to add a commentAdd a comment