
ఇండోర్ : మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి జితు పట్వారీ చేసిన పనిపై పలవురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఇండోర్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అయితే చాలా సేపటివరకు పరిస్థితి అలానే ఉండటంతో మంత్రి తన వాహనంలో నుంచి కిందకు దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. వాహనదారులకు ఆదేశాలు ఇస్తూ.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు మంత్రికి అక్కడున్న పలువురు సహకరించారు. మంత్రి రంగంలోకి దిగడంతో కొద్దిసేపట్లోనే అక్కడ ట్రాఫిక్ సమస్య తీరిపోయింది.
మంత్రి తన కారు నుంచి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది.
#WATCH: Madhya Pradesh Sports Minister, Jitu Patwari, helped in managing traffic after he got stuck in a traffic jam in Indore, yesterday. #MadhyaPradesh pic.twitter.com/HILkS4fFcl
— ANI (@ANI) September 10, 2019