సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గురువారం 26 డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో నాగార్జునసాగర్ జలాశయం సుందరంగా మారింది. దీనికి తోడు సెలవు రోజు కావడంతో సాగర్ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో డ్యామ్ వద్ద భారీగా జనం చేరి వాహనాలు రోడ్డుపై నిలబడిపోయాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆంక్షలు పెట్టినా వాహనదారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ట్రాఫిక్ క్లియర్ చెయ్యలేక పోలీసులు చెతులేత్తేశారు.
Comments
Please login to add a commentAdd a comment