ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు
ఇబ్రహీంపట్నం: ట్రాఫిక్ జాంతో ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం స్థానికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు గంటకుపైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేపై ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. స్థానిక అంబేడ్కర్, డాక్‌బంగ్లా చౌరస్తాల వద్ద పాత ఇబ్రహీంపట్నం, మంచాల రోడ్డు, బృందావన్ కాలనీ వైపు వెళ్లేందుకు దారులుంటాయి.
ఇక్కడే వాహనాదారులు టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్–సాగర్ రోడ్డుపై వెళ్లే వాహనాలతోపాటు ఈ మూడు దిక్కుల నుంచి వాహనాలు టర్న్ చేసుకునేందుకు నిరీక్షించాల్సి వస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా రోడ్లపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాటిని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.
దీంతో ఆర్టీసీ సిబ్బంది, ఓ బాటసారి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సాయపడ్డారు. వారి సాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇబ్రహీంపట్నానికి మంజూరైన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను వెంటనే ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment