HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ నగరం | Huge Traffic Jam In Hyderabad City Due To Long Queues At Petrol Pumps - Sakshi
Sakshi News home page

HYD Traffic Jam: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. కిలోమీటర్‌ దూరానికి గంటల టైం!

Published Tue, Jan 2 2024 8:19 PM | Last Updated on Tue, Jan 2 2024 8:41 PM

Petrol Rush Huge Traffic Jam In Hyderabad - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో హైదరాబాద్‌ అనే మహా నగరం చిక్కుకుంది. పెట్రోల్‌ బంకుల దగ్గర భారీ క్యూల నేపథ్యంలో నేపథ్యంలో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు. 

మంగళవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రో స్టాక్‌లు నిండుకుంటాయనే ప్రచారాల నేపథ్యంలో.. ట్యాంక్‌ ఫుల్‌ చేసుకునేందుకు వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. మరికొందరు క్యాన్‌లతో బంక్‌ల వద్ద క్యూలలో నిల్చున్నారు. దీంతో బంక్‌ల వద్ద మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. దీంతో దాడులు జరగవచ్చనే ఆందోళనతో బంక్‌ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

అంతకు ముందు ఉదయం ఆయిల్‌ ట్యాంకర్లు రాకపోవడంతో బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్‌,డీజిల్‌ దొరకదనే ఆందోళనతో వాహనదారులు బంకుల వైపు పరుగులు తీశారు. తీరా సాయంత్రం కల్లా ఆయిల్‌ ట్యాంకర్ల రాకతో కాస్త ఉపశనమం లభించింది. అయితే మళ్లీ పెట్రోల్‌ దొరుకుతుందో లేదో అనే ఆందోళన నడుమ వాహనదారులు బంకుల వైపు వెళ్తున్నారు. 

వాహనాల రద్దీతో కిలోమీటర్‌ దూరానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. లక్డీకాపూల్‌తో పాటు గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్‌ నెలకొంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement