No stock board
-
HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాద్ అనే మహా నగరం చిక్కుకుంది. పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూల నేపథ్యంలో నేపథ్యంలో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు. మంగళవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రో స్టాక్‌లు నిండుకుంటాయనే ప్రచారాల నేపథ్యంలో.. ట్యాంక్ ఫుల్ చేసుకునేందుకు వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. మరికొందరు క్యాన్లతో బంక్‌ల వద్ద క్యూలలో నిల్చున్నారు. దీంతో బంక్‌ల వద్ద మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌పై ప్రభావం పడింది. దీంతో దాడులు జరగవచ్చనే ఆందోళనతో బంక్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంతకు ముందు ఉదయం ఆయిల్ ట్యాంకర్లు రాకపోవడంతో బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్,డీజిల్ దొరకదనే ఆందోళనతో వాహనదారులు బంకుల వైపు పరుగులు తీశారు. తీరా సాయంత్రం కల్లా ఆయిల్ ట్యాంకర్ల రాకతో కాస్త ఉపశనమం లభించింది. అయితే మళ్లీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన నడుమ వాహనదారులు బంకుల వైపు వెళ్తున్నారు. వాహనాల రద్దీతో కిలోమీటర్ దూరానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. లక్డీకాపూల్‌తో పాటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ నెలకొంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. Ye kya huwa 😂🤣#PetrolDieselPrice #petrolpump #Hyderabad #Petrol #Whatsapp #TruckDriversProtest #ViralVideos #petrolpump pic.twitter.com/sr22sefUjd — Nitin yadav (@Nitinyada7) January 2, 2024 #TruckDriversProtest: Long queues at petrol pumps, with most fuel stations running dry in #Hyderabad. This video from the Assembly metro station petrol pump. pic.twitter.com/sNfoHfRiWI — Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) January 2, 2024 Avoid #Ikea #Raidurgam #hitechcity #inorbit #cyberabad Complete chaos, full of traffic wit horn all around.. pls pls don't come out and don't be traffic 🙏🙏@HiHyderabad @3rdEyeDude @Team_Road_Squad @vinay_vangala @KTRBRS @swachhhyd #hyderabad #Telangana #PetrolDieselPrice pic.twitter.com/QVXJjOsATk — TGCitizen (@Citizen_TS) January 2, 2024 -
HYD: బంకుల్లో నో పెట్రోల్.. వాహనదారుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక -
పెట్రోల్, డీజిల్ ‘కట్’కట
సాక్షి, నెట్వర్క్: భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత వేయడంతోపాటు క్రెడిట్ సదుపాయాన్ని రద్దుచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులు వారంలో నాలుగు రోజులపాటు నో స్టాక్ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కొరత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లోనే తలెత్తుతుండటంతో ఆయా డీలర్లు లబోదిబోమంటున్నారు. క్రెడిట్ విధానం రద్దు చేయటంతో వారు నగదు చెల్లించి బుక్ చేసిన ట్యాంకర్లను సైతం నాలుగైదు రోజులు ఆలస్యంగా పంపుతున్నారు. అలాగే, వారి కోటాలో 50 నుంచి 75 శాతమే సరఫరా చేస్తుండటంతో డీలర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరలో వ్యవసాయ, విద్యా సంవత్సరాలు ప్రారంభమవుతున్న సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సాధారణ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంక్‌ల నిర్వహణ కష్టంగా మారుతోందని డీలర్లే స్వచ్ఛందంగా బంకులు బంద్ చేసుకుంటున్నారు. కోటాకు కోతలొద్దు గత వారం రోజులుగా రేషనింగ్ విధానంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే పలు బంకులు మూతపడే స్థాయికి చేరాయి. క్రెడిట్ విధానం లేదంటున్న కంపెనీలు నగదు చెల్లించిన వారికి సైతం పూర్తి కోటాను ఇవ్వడం లేదు. వెంటనే పూర్తి కోటా కేటాయించి, డీలర్ల కమీషన్ సైతం పెంచాలి. – అమరేందర్రెడ్ది, రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారుల కోటాకు కత్తెర వేస్తున్నాయి. దీంతో సరిపడా స్టాక్ లేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలి. – దినేష్‌రెడ్డి, డీలర్స్ అసోసియేషన్, నిజామాబాద్ సరిపడా సరఫరా లేదు గతంలో క్రెడిట్‌పై ఇండెంట్ పెట్టినా డిపోల నుంచి ఇంధన ట్యాంకర్లు పంపేవారు. ఇప్పుడు డబ్బులు కట్టినా పూర్తి కోటా ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో డీజిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.8 భారం పడుతోందని ఒక్కో సేల్స్ ఆఫీసర్ కోటా పరిధిలో సగానికి చేశారు. బల్క్ సరఫరా కూడా బంక్‌ల నుంచే జరుగుతుండటంతో మరింత కొరత ఏర్పడింది. – పొన్నాల వినయ్, డీలర్, బీపీసీఎల్, క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా -
ఉల్లి.. నీకు దండమే
స్టాకు పెంచుతున్నా తప్పని తిప్పలు బారులు తీరుతున్న ప్రజలు నేటి నుంచి మరిన్ని కౌంటర్లు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే సరఫరా తెల్లారితేచాలు..ఉల్లి కష్టాలు మొదలవుతున్నాయి. మార్కెట్లో చుక్కలను తాకిన పాయలను అందుకోలేక సామాన్య మధ్యతరగతి వర్గాలు రైతుబజారు బాట పడుతున్నారు. తీరా వెళ్లేసరికి చాంతాడంత క్యూ దర్శనమిస్తోంది. ఎక్కడ ఉల్లిపాయలు నోస్టాక్ బోర్డు పెట్టేస్తారేమోననే భయంతో తోపులాట..ఈ లైన్లలో ఎదురవుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎండయినా..వానయినా అడుగు కదలకుండా నిలబడుతున్నారు. తమవరకూ ఉల్లి వస్తుందా రాదా అని క్షణమొక యుగంగా లైన్లో ఎదురుచూస్తున్నారు. నిత్యం రైతు బజార్లలో ఇదే పరిస్థితి..రేపూ మారుతుందని నమ్మకం లేదు. విశాఖపట్నం: ఉల్లికష్టాలు ఇప్పట్లో తీరేటట్టు కన్పించడం లేదు. రోజురోజుకు ఉల్లి పాట్లు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డిమాండ్ తగ్గ సరుకులేకపోవడంతో ఉల్లిపాయ కూడా దొరకడం గగనంగా మారింది. ఇదే సమయంలో ఉల్లిదొంగతనాలు జోరందుకుంటున్నాయి. మరొకపక్క తార్‌మార్ తక్కెడ మార్ అంటూ తూకాల్లో మోసాలు ఎక్కువయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు ఏ మాత్రం సత్ప లితాలనివ్వడంలేదు. రైతుబజార్లలోనే హోల్‌సేల్, రిటైల్మార్కెట్లలో సైతం బోర్డుల్లో అధికారులు నిర్ధేశించిన ధరల కంటే కనీసం 20శాతం అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతవాసులకు ఉల్లిపాయ చూద్దామంటే కన్పించని పరిస్థితి నెలకొంది.విశాఖపరిసర ప్రాంతాల్లో ఉన్న 12 రైతు బజార్లలో ఇప్పటి వరకు అధికారికలెక్కల ప్రకారం 9562.20 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల విక్ర యాలు జరిగాయి. వీటిలో కనీసం 20 శాతం పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇప్పటివ రకు రైతుబజార్ల ద్వారా రోజుకు 30నుంచి 40 మెట్రిక్ టన్నుల ఉల్లివిక్రయాలు జరుగుతుండగా నేటి నుంచి స్టాక్‌ను పెంచుతున్నారు. ఇవన్నీ రికార్డులకే పరిమితమవుతున్నాయి తప్ప వాస్తవానికి ఆ స్థాయిలో అమ్మకాలు జరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం కంచరపాలెం రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏర్పాట్లు ఇలా చేస్తే ఎలా అంటూ నిల దీశారు. బుధవారం రాత్రికి కర్నూలు నుంచి 60 ఎంటీల దిగుబడి చేయిస్తున్నారు. గురువారం 11 రైతుబజార్లకు అదనంగా నగరంలోని సూపర్‌బజార్‌తో పాటు తగరపువలసలోని ఫుట్బాల్గ్రౌండ్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని రైతుబజార్లో మాత్రం గురువారంవిక్రయాలను నిలిపి వేశారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను రెట్టింపు చేస్తున్నారు. తోపులాటలు జరగకుండా ఉండేందుకు దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే స్టాక్‌ను కూడా పెంచుతున్నారు. రద్దీ పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా ప్రతీ ఒక్కరికి ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు తెల్లకార్డుపై కిలో ఉల్లి పాయలు మాత్రమే ఇస్తుండగా..నేటి నుంచి రెండుకిలోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసారు.అలాగే కౌంటర్ల వద్ద మంచీనీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. -
నో ఫిల్లింగ్!
రాజంపేట: జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులలో నోస్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. బంకుల యజమానులు డబ్బులు కట్టలేకకాదు..సరైన మోతాదులో పెట్రోలు..డీజిల్ దిగుమతి లేని పరిస్ధితులు నెలకొంటున్నాయి. జిల్లాలోని సగానికిపైగా పెట్రోలు, డీజిల్ బంకుల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలోని రాజంపేట, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల తదితర ప్రాంతాల్లో ప్రధానంగా మూడు కంపెనీలకు చెందిన బంకులను అధికసంఖ్యలో ఏర్పాటుచేశారు. నిత్యం లక్షలాది లీటర్లు బంకుల ద్వారా సరఫరా అవుతోంది. హెచ్పీసీ(హిందూస్థాన్‌పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), బీపీసీఎల్(భారత్పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా ఆయిల్ ఫిల్లింగ్‌స్టేషన్లను విరివిగా ఏర్పాటుచేశారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో చాలాచోట్ల లేదు..లేదు అన్న పదాలు వాహనదారులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. ఎందుకు ఇలా..... కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు పెట్రోలు, డీజిల్ సరఫరాచేసేందుకు జిల్లా కేంద్రంలోని కడప రైల్వేస్టేషన్ సమీపంలో ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీఎల్ డిపోలు ఒకేచోట ఉండేవి. రైల్వేతో ఉన్న 50 యేళ్ల అగ్రిమెంటుకు కాలపరిమితి ముగిసింది. దీని ఫలితంగా అక్కడి నుంచి డిపోలను మూసివేయాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. మూడు ప్రధానసంస్ధలు వేర్వేరుచోట్ల డిపోలను ఏర్పాటుచేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా గుత్తిలో బీపీసీఎల్ డిపో ఏర్పాటు కాగా, చిత్తూరులో ఐఓసీ డిపోను ఏర్పాటుచేసుకుంది. భాకరాపేట వద్ద హెచ్‌పీసీఎల్ డిపో ఏర్పాటు పూర్తికావస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డిపోలోకి రైల్వేట్రాక్‌ను కూడా వేసుకున్నారు. త్వరలో ఈ డిపో వినియోగంలోకి రానున్నదని సమాచారం. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ జిల్లాలోని ఆయిల్ ఫిల్లింగ్‌స్టేషన్ల నిర్వహణ విషయంలో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కనిపిస్తోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సేల్‌ట్యాక్స్ పరంగా నెంబర్లు కూడా మారిపోనున్నాయి. ఇందువల్ల కొన్ని బంకుల యజమానులు కూడా ఫిల్లింగ్‌స్టేషన్ల నిర్వహణ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న నెంబర్లు కాకుండా విభజన తర్వాత కొత్తగా సేల్‌ట్యాక్స్ నెంబర్లు వస్తాయి. పాతనెంబరు..కొత్తనెంబర్ల అంశంతో ఫిల్లింగ్స్టేషన్లకు సంబంధించి పన్ను వ్యవహారంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో కొంతమంది తమ ఫిల్లింగ్‌స్టేషన్లను ఖాళీగానే ఉంచుకున్నారు. కొత్తగా సేల్‌ట్యాక్స్ నెంబర్లతో తిరిగి పెట్రోలు, డీజల్ వ్యాపారాలు సాగించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఇతర డిపోల నుంచి.. జిల్లాలో ప్రస్తుతానికి చిత్తూరు, గుత్తి ,ఒంగోలు డిపోల నుంచి పెట్రోలు, డీజిల్‌ను జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్ధితిలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. అంతేగాకుండా అదే స్ధాయిలో డిమాండ్‌కు కూడా ఏర్పడింది. బంకుల యజమానులు పెట్రోలు, డీజిల్‌కు డబ్బులు కట్టినా దిగుమతి ఆలస్యమవుతోంది. మరికొంతమంది బంకు యజమానులు పరస్పర సర్దుబాటుతో బంకులను నిర్వహిస్తున్నారు. కొందరైతే బంకులకు పెట్రోలు, డీజిల్‌ను దిగుమతి చేసుకోవడంలేదు. చాలాచోట్ల ఇదే పరిస్ధితులు ఉండటంతో బంకులు నిండుకున్నాయి.