
సికింద్రాబాద్ :అసలే ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న సిటీజనులు...సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలతోనూ పాట్లు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద సిగ్నల్ రెడ్, గ్రీన్ లైట్లు ఒకేసారి వెలగడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ఇలా అయితే అన్ని వైపుల వాహనదారులు కదిలి... ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.