మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటి సంరక్షించాలి
Published Mon, Aug 22 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజలో ల్యాబ్ ఆవరణలో సోమవారం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో హెజెలో ల్యాబ్ హెచ్‌ఆర్ ప్రభాకర్, వీఆర్వో షేక్ చాంద్‌పాష, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement