
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, మరికొన్ని దేశవిదేశీ సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న హైదరాబాద్ డిజైన్ వీక్ ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం సస్టెయినబుల్ ఫ్యాషన్ అనే అంశంపై ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో బంగ్లాదేశ్‌కు చెందిన డిజైనర్ బిబిరసెల్ డిజైన్ చేసిన వస్త్రాలను ప్రదర్శించారు. మనవైన చేనేత దుస్తులనూ మోడల్స్ ధరించి ర్యాంప్ వాక్ చేశారు.