బంగారురంగు
⇒ వస్త్రాలంకరణ పెళ్లిలో జిలుగు వెలుగులను కురిపిస్తుంది. మేనిరంగు నిగారింపుగా కనిపిస్తుంది. అందుకే, ప్రఖ్యాతిగాంచిన డిజైనర్లు సైతం ఈ రంగు వస్త్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
పెళ్లికూతురు, పెళ్లికొడుకు
ఎలాగూ ఏడడుగులు వేస్తారు.
అగ్నిహోత్రం చుట్టూ వేస్తే
ఈ పవిత్రమైన సప్తపది
ఏడుజన్మల బంధానికి మొదటి అడుగు అవుతుంది.
మరి పెళ్లికొచ్చిన అమ్మాయిలు
సరదాగా,
చలాకీగా,
అందంగా,
అనందంగా,
ఏడు హంగులూ
ఏడు రంగులతో ముస్తాబై
పెళ్లికి వెళితే
అది సంతోషాల ఆహ్వానమే!
⇔ ఏ చిన్న పార్టీ అయినా ఎప్పుడూ ఎవర్‌గ్రీన్ అనిపించే వస్త్రాలంకరణ శారీ! ‘పట్టుచీర కట్టుకోవాలా!’ అంటూ ఇబ్బంది పడే అమ్మాయిలు సింపుల్‌గా అనిపించే ఇలాంటి లైట్‌వెయిట్ పట్టు చీర కట్టుకుంటే వేడుకలో ‘సూపర్బ్’ అనే ప్రశంసలు మీకే!
⇔ కొంతమంది అమ్మాయిలు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌లను ఇష్టపడతారు. వాటిలో ధోతీ ప్యాంట్, షార్ట్ కుర్తీ సరైన ఎంపిక. వేడుకలకు హెవీ డిజైన్స్ ఇష్టపడని నవతరం గర్ల్స్ ఈ తరహా డ్రెస్సింగ్‌తో హైలైట్‌గా నిలిచిపోవచ్చు.
⇔ లాంగ్ స్కర్ట్ మీదకు ఓవర్ కోటులా ఉండే డిజైనర్ టాప్ ధరిస్తే పెళ్లిలో ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇప్పుడు ఇది ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్. ఈ తరం అమ్మాయిలు కోరుకునే పార్టీవేర్‌గానూ ఈ డ్రెస్ ముందు వరసలో ఉంది.
⇔ ప్రెట్టీ లుక్‌తో ఆకట్టుకోవాలంటే క్రీమ్ లేదా వైట్ లాంగ్ లెహంగా దాని మీదకు పూర్తి కాంట్రాస్ట్ క్రాప్‌టాప్ వేసుకుంటే చాలు. వేడుకలో యువరాణిలా మెరిసిపోవచ్చు.
⇔ ఇంకా సింపుల్, కంఫర్ట్ లుక్‌తో అట్రాక్ట్ చేయాలంటే అనార్కలీ డ్రెస్ వేసుకొని, దానికి మీదకు డిజైనర్ ఓవర్ కోట్ ధరిస్తే చాలు. ‘మార్వలెస్’ అనే కితాబు ఇట్టే కొట్టేస్తారు.
⇔ హరివిల్లులో ఏడురంగులున్నట్టే ధరించే డ్రెస్‌లోనూ ఆ హంగులు ఉండేలా చూసుకుంటే వేడుకలో మల్టీకలర్స్‌తో చూపరుల మతులు పోగొట్టవచ్చు.
పెళ్లి పిలుపు సప్తకళ
Published Thu, Feb 23 2017 11:01 PM | Last Updated on Thu, May 24 2018 2:36 PM
Advertisement
Advertisement