ఎవరీ శ్రీయా భూపాల్? | Akhil Lover Is Shriya Bhupal! | Sakshi
Sakshi News home page

ఎవరీ శ్రీయా భూపాల్?

Published Tue, Jun 28 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

ఎవరీ శ్రీయా భూపాల్?

ఎవరీ శ్రీయా భూపాల్?

ఫ్యాషన్ ప్రపంచంలో శ్రీయా భూపాల్ చాలా ఫేమస్. కానీ, బయటి ప్రపంచానికి ఆమె ఎవరో తెలియదు. ఇది నిన్న, మొన్నటి మాట. ఇప్పుడు అఖిల్‌తో ప్రేమలో ఉన్నది శ్రీయా భూపాల్ అని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో ఔత్సాహికుల్లో ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం మొదలైంది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తల ప్రకారం ఫ్యాషన్ రంగంలో శ్రీయా భూపాల్‌కి మంచి పట్టు ఉందట.
 
  రెండేళ్ల క్రితం ‘శ్రీయా సమ్’ లేబుల్ కలక్షన్ ‘ఎబ్ అండ్ ఫ్లో’ని ప్రారంభించారట. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన తన తండ్రికి భావగీతం (ఓడ్)గా తన లేబుల్‌ని అంకితం చేశారని సమాచారం. కాగా, రెండు నెలల క్రితం జరిగిన ‘ల్యాక్‌మి ఫ్యాషన్ వీక్’లో తొలిసారి తన కలక్షన్‌ని శ్రీయ ప్రదర్శించారని టాక్. తొలి చూపులోనే శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయట. అలా ఫస్ట్ స్టెప్‌లోనే భేష్ అనిపించుకున్నారని ఫ్యాషన్ ఫీల్డ్ అంటోంది.
 
 శ్రీయ గురువు ప్రముఖ హిందీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని అట. శ్రీయా భూపాల్ పలువురు కథానాయికలకు కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారని కూడా ఫిలింనగర్ టాక్. శ్రీయ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. ఇలా శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిన తారల జాబితా చాలానే ఉందట.
 
 ఎప్పట్నుంచో అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్ కుటుంబానికి స్నేహం ఉందని ఆంగ్ల పత్రిక ప్రచురించిన విషయం విదితమే. సో.. మొదట్లోఅఖిల్, శ్రీయ స్నేహంగానే ఉండి ఉంటారేమో. ఆ తర్వాతే ఇష్టంగా మారి ఉంటుందేమో. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త వినిపిస్తోంది కాబట్టి, అఖిల్-శ్రీయల లవ్‌స్టోరీకి పెళ్లితో శుభం కార్డు పడుతుందా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement