![పెళ్లి లెహెంగా! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81485451594_625x300.jpg.webp?itok=TDhRbCSp)
పెళ్లి లెహెంగా!
పెళ్లికి చీరలు కదా కట్టాల్సింది అలా అనుకుంటే మీకు ఫ్యాషన్ అర్థం కానట్టే అంటున్నారు. డిజైనర్లు అవునూ, లంగా కదా లెహెంగా ఏంటి?! అదేనమ్మా! ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, రిసెప్షన్‌కి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రిచ్ అండ్ డిజైనర్ లంగాలనే లెహంగాలు అంటున్నారు.
► వేదికపై ‘బ్యూటీ క్వీన్’లా మెరిసిపోవాలంటే గ్రాండ్ లెహంగాయే సరైన ఎంపిక.
► నెటెడ్, సిల్క్ లెహంగా దుపట్టాలను ఎంచుకున్న ప్పటికీ వాటికి ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ ప్యాచ్‌లు ఎంతో ఆకర్షణను పెంచుతాయి.
►డబుల్ కలర్ లెహంగా ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. లెహంగా అంచు పూర్తి కాంట్రాస్ట్.. లేదంటే మల్టీకలర్ లో ఉన్నది ఎంపిక చేసుకోవాలి.
►పెళ్లి అనగానే చాలా వరకు ఎరుపు, పచ్చ రంగు లెహంగా వైపే మొగ్గు చూపుతారు. వీటిలోæ ముదురు రంగులను ఎంచుకుంటే మరింత గ్రాండ్‌గా కనిపిస్తారు.
► నైట్ ఫంక్షన్‌లో చందమామలా వెలిగిపోవాలంటే తెల్లటి లెహంగా సరైన ఎంపిక. దీనికి కాంట్రాస్ట్ బార్డర్, బ్లౌజ్, దుపట్టాలను ఎంచుకోవచ్చు.
► ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా మెరిసిపోవ డంతో వేడుకలో వెల్వెట్ లెహెంగా రాయల్ లుక్ తో అట్రాక్ట్ చేస్తుంది.