ఇండియాలో ఫ్యాషన్ సీన్‌ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్‌ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్‌లలో టాప్ ఆఫ్ ది ఆల్‌గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్‌కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!
ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్‌ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.
అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్‌పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్‌ల మేళవింపుతో పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్‌లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.
ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్‌కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్‌గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.
దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్‌ఫిట్‌నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది.
"డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్‌మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్‌పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక‍్స్‌ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ.
Comments
Please login to add a commentAdd a comment