గొల్ల భామలు | ne | Sakshi
Sakshi News home page

గొల్ల భామలు

Published Fri, Apr 27 2018 12:36 AM | Last Updated on Fri, Apr 27 2018 12:36 AM

ne - Sakshi

తరతరాలుగా వస్తున్న ఒక అందమైన, అద్భుతమైన సంప్రదాయం గొల్లభామ చీరలు.నేసినంతసేపు చేతులు నాట్యమాడతాయితొడిగినంతనే మేను నాట్యం చేస్తుంది.సంప్రదాయం పిల్లలకు అలవర్చాలి. 
అప్పుడే ఇంకో వంద తరాలు ఆ నేత నిలుస్తుంది.అందుకే గొల్లభామ చీరలతో పిల్ల భామలకు  సొబగులు అద్దుతున్నారు డిజైనర్లు.

►హాఫ్‌వైట్, ఆరెంజ్‌ .. రెండు  కాంట్రాస్ట్‌ కలర్‌ గొల్లభామ చీరలతో లాంగ్‌ గౌన్‌గా తీర్చిదిద్దారు. లాంగ్‌ స్లీవ్స్‌కి పల్లూ పార్ట్‌తో డిజైన్‌ చేశారు. 

►ఈ డ్రెస్‌లోనూ రెండు కాంట్రాస్ట్‌ చీరలను ఎంపిక చేసుకున్నారు. బెల్‌ ఫ్రిల్స్‌ లాంగ్‌ స్లీవ్స్‌ని ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు.

►గొల్లభామ పంచెను ధోతీలా కుట్టి, దాని మీదకు కాటన్‌ బ్లేజర్‌ను  జత చేశారు. కాంట్రాస్ట్‌ కలర్‌ దుపట్టాను వాడారు. దీంతో  ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌  లుక్‌ వచ్చింది.

► ఒకే రంగు గొల్లభామ చీరతో డిజైన్‌ చేసిన వెస్ట్రన్‌ డ్రెస్‌ ఇది. పల్లూభాగంతో డిజైన్‌ చేసిన బెల్‌ స్లీవ్స్‌కి , కాలర్‌ నెక్‌ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ. 

► పసుపు రంగు గొల్లభామ చీరతో రూపొందించిన పార్టీవేర్‌ డ్రెస్‌ ఇది. కొంగులో కొంత భాగం ఛాతీకి, మిగతాది చేతులకు డిజైన్‌ చేశారు. 

► హాఫ్‌ వైట్, రెడ్‌ కలర్‌ రెండు చీరలను ఉపయోగించి కాంట్రాస్ట్‌  డిజైన్‌తో లేయర్డ్‌ గౌన్‌గా తీర్చిదిద్దారు.

మీరే డిజైనర్‌ సిల్క్‌ థ్రెడ్‌ వడ్డాణం
తయారీ
1. బంగారు రంగు దారాన్ని పొడవాటి స్కేల్‌కి నిలువుగా కనీసం 50–60 వరసలు చుట్టాక స్కేల్‌ నుంచి దారం తీసి, చివరన ప్లకర్‌ లేదా కత్తెరతో కట్‌ చేసి, గ్లూ పెట్టి దారం పోగులు విడివడకుండా గ్లూతో అతికించాలి. 
2. గ్లూతో అతికించిన దారం పోగుల చివరి భాగాన్ని హెయిర్‌ క్లిప్‌కి సెట్‌ చేసి, మూడు పాయలు తీసి జడలా అల్లాలి. చివరన మళ్లీ గ్లూతో విడివడకుండా అతికించాలి. ఇలాంటివి దారాలతో జడలుగా అల్లిన నాలుగు చైన్లను సిద్ధం చేసుకోవాలి. 
3. కాగితం చార్ట్‌ మీద గ్లూ రాసి దాని మీద పెద్ద ఎర్రటి కుందన్‌ పెట్టి సెట్‌ చేయాలి. దాని చుట్టూ గోల్డెన్‌ బాల్‌ చెయిన్‌ చుట్టి చివర్లను పక్కర్‌తో కట్‌ చేయాలి. తర్వాత మళ్లీ గ్లూ పెట్టి మరో వరుస రెడ్‌ బాల్‌ చెయిన్, రాళ్ల చెయిన్, గ్రీన్‌ బాల్‌చెయిన్, చివరగా ముత్యాల చెయిన్‌.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్లూ పెడుతూ, చుట్టాలి. ఇది గుండ్రటి షేప్‌ వస్తుంది.
4. చుట్టూ అదనంగా ఉన్న చార్ట్‌ని ప్లకర్‌తో కట్‌ చేయాలి. ఇలా గుండ్రటి డిజైనర్‌ షేప్‌ను తయారుచేసుకోవాలి. 
5. సిద్ధం చేసుకున్న థ్రెడ్‌ చెయిన్‌ని మధ్యకు మడిచి, మార్క్‌ చేసుకొని, గ్లూ పెట్టి, డిజైనర్‌ బిళ్లను సెట్‌ చేయాలి. 
6. దీని పక్కనే చిన్నకుందన్‌ని గ్లూతో అతికించి, దాని చుట్టూ గోల్డ్, స్టోన్, రెడ్‌ బాల్‌ చెయిన్స్‌ని అతికిస్తూ, చివర్లను ప్లకర్‌తో కట్‌ చే యాలి.  
7. రెండువైపులా థ్రెడ్‌ చెయిన్స్‌ని గ్లూతో అతికించాలి. తర్వాత రెడ్, గ్రీన్, స్టోన్‌ బాల్‌ చెయిన్స్‌ని ఆ చెయిన్‌ మీద పొడవాటి లైన్‌గా అతికించాలి. 
8. చివరలను కత్తిరించి, గ్లూతో అతికించాలి. 
9. గోల్డ్‌ బాల్‌ చెయిన్‌ని చిన్న చిన్న పీసులుగా ప్లకర్‌తో కట్‌ చేసి, బెల్ట్‌కి వెనకాల తోరణం మాదిరి గ్లూతో అతికించాలి.
10. తెల్లటి పూసలు లేదా ముత్యాలు ఉన్న పిన్‌ బాల్స్‌ని బెల్ట్‌కి గుచ్చాలి. అవి ఊడకుండా మధ్య భాగంలో గ్లూతో అతికించాలి. 
11. గోల్డ్‌ చెయిన్‌ బాల్‌ని తోరణంలా అతికించాలి.
12. చివరలు హుక్స్‌ ఉన్న చెయిన్స్‌ని అతికించాలి.
నిర్వహణ: ఎన్‌.ఆర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement