ముంబయి: బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ కు చెందిన ఓ డిజైనర్ తరుచుగా మికా సింగ్ ఇంటికి వెళ్లొస్తుంటుందని, అయితే, ఇటీవల ఒకసారి వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, కేసు నమోదు చేసినపోలీసులు.. విచారణకు హాజరుకావాలని ఇంకా ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. గతంలో 2006లో ఓ పార్టీలో రాఖీ సావంత్ను ముద్దు పెట్టి మికాసింగ్ కేసులో ఇరుక్కున్నాడు.
ఇంటికొచ్చిన డిజైనర్పై సింగర్ లైంగిక వేధింపులు
Published Wed, Jul 6 2016 9:14 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
Advertisement
Advertisement