ఫ్యాషన్ షోకేస్
మెరిసిన నిఫ్ట్ విద్యార్థులు
విభిన్న వస్త్రధారణలో నిఫ్ట్ విద్యార్థులు దుమ్మురేపారు. తాము రూపొందించిన డిజైన్స్‌లో ప్రత్యేకతను చాటారు. గురువారం రాత్రి ‘నిట్‌మోడా’ పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో 33 మంది విద్యార్థులు ర్యాంప్‌పై మెరిశారు. ఉదయం ‘డిజైన్ షోకేస్–2017’ పేరిట ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర హాండీక్రాప్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శైలజరామయ్యర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – మాదాపూర్
సొంతంగానే..
ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ థీమ్‌తో హోమ్ డెకార్స్‌ను రూపొందించాం. ప్రాజెక్టులో భాగంగా ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాం. కొంతకాలం కంపెనీలో పనిచేసి.. అనుభవం వచ్చాక సొంతంగా బొటిక్‌ను ఏర్పాటు చేస్తా. – వైష్ణవి
ట్రావెల్ బ్యాగ్స్ స్పెషల్..
ప్రస్తుతం ట్రావెల్ బ్యాగ్స్ ట్రెండ్ నడుస్తోంది. బ్యాగులు సంప్రదాయంగా ఉంటూనే ట్రెండీగా కనిపించాలనుకుంటున్నారు. అందుకు తగ్గటే బ్యాగ్స్ రూపొందించా. మొదట ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఫ్యాషన్ రంగంలో రాణిస్తా. – ఐశ్వర్య బాబుపాల్
కర్రతో హోం డెకార్స్
ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నా. ఇవన్నీ కొత్త థీమ్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి. సొంత బొటిక్ ఏర్పాటు చేయాలనుంది. – వంశికజైన్ తోలియా