Nift students
-
నిఫ్ట్ స్పెక్ట్రమ్ 2020 వేడుకలు
-
వరద నీటిలో యువతి ఫొటో షూట్
బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. పట్నాలోని పలు రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్ జరిపారు. రోడ్డుపై నిలిచిన నీళ్ల మధ్యకు వెళ్లి పొటోలు దిగారు. ఫొటోగ్రాఫర్ చేతిలో గొడుగు పట్టుకుని మరి ఆమె ఫొటోలను తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటో షూట్లో పాల్గొన్న యువతి ప్రస్తుతం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో విద్యార్థిగా ఉన్నారు. ఆమె పేరు అదితి సింహ. కాగా, ప్రస్తుతం పట్నాలో ఉన్న పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు తాము ఇలా చేశామని ఫొటో షూట్ జరిపిన వారు తెలిపారు. అయితే ఈ ఫొటో షూట్‌ను కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. -
ఫ్యాషన్ షోకేస్
మెరిసిన నిఫ్ట్ విద్యార్థులు విభిన్న వస్త్రధారణలో నిఫ్ట్ విద్యార్థులు దుమ్మురేపారు. తాము రూపొందించిన డిజైన్స్‌లో ప్రత్యేకతను చాటారు. గురువారం రాత్రి ‘నిట్మోడా’ పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో 33 మంది విద్యార్థులు ర్యాంప్‌పై మెరిశారు. ఉదయం ‘డిజైన్ షోకేస్–2017’ పేరిట ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర హాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శైలజరామయ్యర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – మాదాపూర్ సొంతంగానే.. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ థీమ్‌తో హోమ్ డెకార్స్ను రూపొందించాం. ప్రాజెక్టులో భాగంగా ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాం. కొంతకాలం కంపెనీలో పనిచేసి.. అనుభవం వచ్చాక సొంతంగా బొటిక్‌ను ఏర్పాటు చేస్తా. – వైష్ణవి ట్రావెల్ బ్యాగ్స్ స్పెషల్.. ప్రస్తుతం ట్రావెల్ బ్యాగ్స్ ట్రెండ్ నడుస్తోంది. బ్యాగులు సంప్రదాయంగా ఉంటూనే ట్రెండీగా కనిపించాలనుకుంటున్నారు. అందుకు తగ్గటే బ్యాగ్స్ రూపొందించా. మొదట ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఫ్యాషన్ రంగంలో రాణిస్తా. – ఐశ్వర్య బాబుపాల్ కర్రతో హోం డెకార్స్ ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నా. ఇవన్నీ కొత్త థీమ్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి. సొంత బొటిక్ ఏర్పాటు చేయాలనుంది. – వంశికజైన్ తోలియా -
సెక్స్‌వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా?
న్యూఢిల్లీ: భారత దేశంలో వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పించాలంటూ ఇప్పటి వరకు ఎన్నోసార్లు తెరమీదకు వచ్చిన డిమాండ్ ఇది. పలు మహిళా, సామాజిక సంఘాలు ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ డిమాండ్‌ను తీసుకొచ్చినా అధికారంలోవున్న భారత ప్రభుత్వం ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఇదే డిమాండ్తోని హిమాచల్‌లోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్ధులు ఓ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన నిఫ్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థి 23 ఏళ్ల అమిత్ చౌహాన్ దీనికి ‘నాత్ ఉట్రాయ్’ అని పేరు పెట్టారు. అమిత్, తనతోపాటు చదువుకుంటున్న మరో ఐదుగురు విద్యార్థులతో కలసి ఈ ప్రాజెక్టును చేపట్టి ఇంతవరకు దేశంలోని ఎంతోమంది వేశ్యలను ఇంటర్వ్యూ చేశారు. ఛిద్రమైన వారి జీవితాలకు సంబంధించిన కథలను ప్రపంచం దృష్టికి తీసుకరావడం వారి ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా వారు ఆరుగురు వేశ్యకథలను డాక్యుమెంటరీగా తీస్తున్నారు. వాటినే వచ్చే జనవరి నెలలో పుస్తకంగా విడుదల చేస్తామని అమిత్ మీడియాకు తెలిపారు. తాము ఎంపిక చేసిన ఆరుగురు వేశ్యలలో ముగ్గురు రాజస్థాన్‌కు, మరో ముగ్గురు ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చెందిన వారని ఆయన చెప్పారు. తాము కలుసుకున్న వేశ్యల్లో ఎక్కువ మంది పిల్లా పాపలతో కాపురాలు చేస్తున్నారని, వారికి బడికి కూడా పంపించి చదివిస్తున్నారని, ఇదంతా కూడా వారు తమ శరీరాలను తాకట్టు పెట్టే సంపాదిస్తున్నారని తెలిపారు. భారత్‌లో వేశ్యవృత్తికి చట్టబద్ధత లేకపోవడం వల్ల వారిని దళారులు మోసం చేస్తున్నారని, విటులు హింసిస్తున్నారని, ఎయిడ్స్ లాంటి మహమ్మారి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు విటులు తీసుకోవడం లేదని, దేశంలో ఆడపిల్లల అక్రమ రవాణా కూడా పెరిగిపోతోందని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధతను కల్పించినట్లయితే ఈ సామాజిక సమస్యల నుంచి విముక్తి కల్పించవచ్చని, వేశ్యల డేటాను నమోదు చేయడం, దళారుల ప్రమేయాన్ని అరికట్టడం, ఆడవాళ్ల అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమని, ఆరోగ్య సూత్రాలను పాటించడం, వ్యాపార నియమాలను నిర్దేశించడం సాధ్యమవుతుందని ఆయన వాదిస్తున్నారు. చట్టబద్ధత కల్పించడమంటే వృత్తిని ప్రోత్సహించడం కాదని, నియంత్రించడం అనీ, అమాయకులను దౌర్జన్యంగా ఆ వృత్తిలోకి దింపకుండా నిరోధించడమని ఆయన చెప్పారు. 2014లో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమార మంగళం కూడా ఇలాంటి అభిప్రాయలనే వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పిస్తే వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చని, వృత్తిని నియత్రించవచ్చని ఆమె చెప్పారు. దేశంలో 16 రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మంది సభ్యులు గల అఖిల భారత సెక్స్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతీ దేవీ కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తున్నారు. -
సూపర్ కాన్సెప్ట్స్
మాదాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) వేదికగా ఏర్పాటైన ఫ్యాషన్ ఒలింపియాడ్-2014 యువతరం ఫ్యాషన్ ప్యాషన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. నిఫ్ట్ అన్ని శాఖలతో పాటు పలు ఇతర కాలేజీల విద్యార్థులూ ఇందులో తవు కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. గురువారం ప్రారంభమైన ఈ ఈవెంట్ శుక్రవారం ముగుస్తుంది. ఇది సెమీఫైనల్ కాగా, ఫైనల్ షో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో నిఫ్ట్ విద్యార్థులు ఆధునికత, సంప్రదాయూల మేళవింపుతో రూపొందించిన ఫ్యాషన్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెవన్ కాన్సెప్ట్స్ ప్రధానంగా ఏడు కాన్సెప్ట్స్‌తో పోటీలు నిర్వహించారు. కుట్టుపని లేకుండా.. కేవలం తాళ్లు, అల్లికలతో వివిధ డిజైనర్ వేర్స్‌ను రూపొందించడం ఇందులోని విశేషం. క్లిక్ ‘ఓ’ మానియా ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ వాల్, ఫ్యాషన్ అండ్ మ్యూజిక్, ది బ్రాండ్ గ్రైండ్, క్విక్ సిల్వర్ క్విజ్, జంక్ జక్ట్సాపోస్, ఫ్యాషన్ మారథాన్ కాన్సెప్ట్ లు, థీమ్‌ల రూపకల్పనలో విద్యార్థులు సృజన చాటుకున్నారు. సందడే సందడి.. క్లిక్ ఓ వూనియూ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో సీడీలు, గొడుగుల చాటున రెరుున్ వాల్పేపర్లు, కొటేషన్స్ రాసిన బ్యాక్‌గ్రౌండ్ థీమ్స్‌తో ఫొటోలు తీయుడం ఆకట్టుకుంది. ‘ఫ్యాషన్ వాల్’ పోటీలో ‘నిఫ్ట్’ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు రూపొందించిన ఫ్యాషన్ వాల్ కాన్సెప్ట్స్ హైలైట్‌గా నిలిచారుు. లేసులు, ప్రింటెడ్ వస్త్రాలు, యూర్న్ బాల్స్‌తో ప్రణయ్ భారతీయు సంప్రదాయుం ఉట్టిపడేలా రూపొందించిన వెల్కమ్ డాల్, కార్డ్బోర్డ్ షీట్, యూర్న్, ఊలుతో ఆకాశ్ రూపొందించిన బర్డ్‌నెస్ట్ ప్రశంసలు పొందారుు. ర్యాంప్ అదరహో.. ఫ్యాషన్ అండ్ మ్యూజిక్ కాంటెస్ట్ ఉత్సాహభరితంగా సాగింది. స్టైలింగ్, ర్యాంప్‌వాక్, కొరియోగ్రఫీ ఆధారంగా సాగిన ఈ రౌండ్లో విద్యార్థులు విలక్షణమైన ఫ్యాషన్లు ప్రదర్శించారు. హాలోవీన్ కాన్సెప్ట్, అర్బన్ అండ్ రూరల్ కాన్సెప్ట్, ట్రైబల్ కాన్సెప్ట్, ఎక్స్ట్రీమ్ ఇండియన్ కాన్సెప్ట్, రాయల్ ఖండ్ కాన్సెప్ట్ వంటివి పాత కొత్తల మేలు కలయికగా కనువిందు చేశాయి. ఫ్యాషన్ ఒలింపియాడ్‌లో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్లపై విద్యార్థులకు బ్రాండ్ క్విజ్, క్విక్ సిల్వర్ క్విజ్, వ్యర్థాలతో డిజైన్లను రూపొందించే జంక్ జక్స్టాపోజ్ వంటి కాంటెస్ట్స్ నిర్వహించారు. ఫ్యాషన్ వూరథాన్లో విద్యార్థులు వివిధ కాన్సెప్ట్ సవాళ్లను స్వీకరించి, సత్తా చాటుకున్నాయి. - చల్లపల్లి శిరీష ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
అందాల ఖాదీ
తారలు దిగివచ్చి మలె ్లలు కురిపిస్తే ఎలా ఉంటుందో శిల్పారామంలో శుక్రవారం కనిపించింది. సంప్రదాయ రీతిలో నిఫ్ట్ విద్యార్థులు సాగించిన ఫ్యాషన్ పెరేడ్ అదరహో అనిపించింది. ఆదరణ కోల్పోతున్న ఖాదీ, హ్యాండ్లూమ్ డిజైనింగ్స్‌ను ప్రమోట్ చేస్తూ వారు నిర్వహించిన ఎత్నిక్ ఫ్యాషన్ షో ఆహూతులను కట్టిపడేసింది. ఖాదీ, హ్యాండ్లూమ్స్ డిజైనింగ్స్ ధరించి విద్యార్థులు చేసిన ర్యాంప్‌వాక్ అంద ర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేకాధికారి మధుసూదన్, నిఫ్ట్ డెరైక్టర్ ఎన్జే రాజాంరాం తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్