వరద నీటిలో యువతి ఫొటో షూట్‌ | NIFT Student Photoshoot In Patna Rains | Sakshi
Sakshi News home page

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌

Published Mon, Sep 30 2019 6:34 PM | Last Updated on Mon, Sep 30 2019 6:49 PM

NIFT Student Photoshoot In Patna Rains - Sakshi

బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి  తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. పట్నాలోని పలు రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్‌ జరిపారు. రోడ్డుపై నిలిచిన నీళ్ల మధ్యకు వెళ్లి పొటోలు దిగారు. ఫొటోగ్రాఫర్‌ చేతిలో గొడుగు పట్టుకుని మరి ఆమె ఫొటోలను తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  



ఫొటో షూట్‌లో పాల్గొన్న యువతి  ప్రస్తుతం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో విద్యార్థిగా ఉన్నారు. ఆమె పేరు అదితి సింహ. కాగా, ప్రస్తుతం పట్నాలో ఉన్న పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు తాము ఇలా చేశామని ఫొటో షూట్‌ జరిపిన వారు తెలిపారు. అయితే ఈ ఫొటో షూట్‌ను కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement