సూపర్ కాన్సెప్ట్స్ | Super concepts on NIFT Fashion Olympiad 2014 | Sakshi
Sakshi News home page

సూపర్ కాన్సెప్ట్స్

Published Thu, Oct 30 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

సూపర్ కాన్సెప్ట్స్

సూపర్ కాన్సెప్ట్స్

మాదాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) వేదికగా ఏర్పాటైన ఫ్యాషన్ ఒలింపియాడ్-2014 యువతరం ఫ్యాషన్ ప్యాషన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. నిఫ్ట్ అన్ని శాఖలతో పాటు పలు ఇతర కాలేజీల విద్యార్థులూ ఇందులో తవు కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. గురువారం ప్రారంభమైన ఈ ఈవెంట్ శుక్రవారం ముగుస్తుంది. ఇది సెమీఫైనల్ కాగా, ఫైనల్ షో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో నిఫ్ట్ విద్యార్థులు ఆధునికత, సంప్రదాయూల మేళవింపుతో రూపొందించిన ఫ్యాషన్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి.
 
 సెవన్ కాన్సెప్ట్స్
 ప్రధానంగా ఏడు కాన్సెప్ట్స్‌తో పోటీలు నిర్వహించారు. కుట్టుపని లేకుండా.. కేవలం తాళ్లు, అల్లికలతో వివిధ డిజైనర్ వేర్స్‌ను రూపొందించడం ఇందులోని విశేషం. క్లిక్ ‘ఓ’ మానియా ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ వాల్, ఫ్యాషన్ అండ్ మ్యూజిక్, ది బ్రాండ్ గ్రైండ్, క్విక్ సిల్వర్ క్విజ్, జంక్ జక్ట్సాపోస్, ఫ్యాషన్ మారథాన్ కాన్సెప్ట్ లు, థీమ్‌ల రూపకల్పనలో విద్యార్థులు సృజన చాటుకున్నారు.
 
 సందడే సందడి..
 క్లిక్ ఓ వూనియూ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో సీడీలు, గొడుగుల చాటున రెరుున్ వాల్‌పేపర్లు, కొటేషన్స్ రాసిన బ్యాక్‌గ్రౌండ్ థీమ్స్‌తో ఫొటోలు తీయుడం ఆకట్టుకుంది. ‘ఫ్యాషన్ వాల్’ పోటీలో ‘నిఫ్ట్’ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు రూపొందించిన ఫ్యాషన్ వాల్ కాన్సెప్ట్స్ హైలైట్‌గా నిలిచారుు. లేసులు, ప్రింటెడ్ వస్త్రాలు, యూర్న్ బాల్స్‌తో ప్రణయ్ భారతీయు సంప్రదాయుం ఉట్టిపడేలా రూపొందించిన వెల్‌కమ్ డాల్, కార్డ్‌బోర్డ్ షీట్, యూర్న్, ఊలుతో ఆకాశ్ రూపొందించిన బర్డ్‌నెస్ట్ ప్రశంసలు పొందారుు.
 
ర్యాంప్ అదరహో..
 ఫ్యాషన్ అండ్ మ్యూజిక్ కాంటెస్ట్ ఉత్సాహభరితంగా సాగింది. స్టైలింగ్, ర్యాంప్‌వాక్, కొరియోగ్రఫీ ఆధారంగా సాగిన ఈ రౌండ్‌లో విద్యార్థులు విలక్షణమైన ఫ్యాషన్లు ప్రదర్శించారు. హాలోవీన్ కాన్సెప్ట్, అర్బన్ అండ్ రూరల్ కాన్సెప్ట్, ట్రైబల్ కాన్సెప్ట్, ఎక్స్‌ట్రీమ్ ఇండియన్ కాన్సెప్ట్, రాయల్ ఖండ్ కాన్సెప్ట్ వంటివి పాత కొత్తల మేలు కలయికగా కనువిందు చేశాయి. ఫ్యాషన్ ఒలింపియాడ్‌లో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్లపై విద్యార్థులకు బ్రాండ్ క్విజ్, క్విక్ సిల్వర్ క్విజ్, వ్యర్థాలతో డిజైన్లను రూపొందించే జంక్ జక్స్‌టాపోజ్ వంటి కాంటెస్ట్స్ నిర్వహించారు. ఫ్యాషన్ వూరథాన్‌లో విద్యార్థులు వివిధ కాన్సెప్ట్ సవాళ్లను స్వీకరించి, సత్తా చాటుకున్నాయి.
 - చల్లపల్లి శిరీష
 ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement