డిజైనర్ ష్రగ్!
ఎప్పుడూ ఒకే తరహా డ్రెస్సులు అంటే బోర్ కొడతాయి. ఉన్నవాటినే కొత్తగా తయారుచేసు కోవచ్చు. రెండు టీ షర్ట్‌లతో ఒక డిజైనర్ టాప్/ షగ్‌న్రు తయారీ తెలుసుకుందాం. ఒక ప్రింటెడ్ టీ షర్ట్, మరోటి ప్లెయిన్ టీ షర్ట్ లేదా ట్యునిక్ తీసుకోవాలి .స్లీవ్స్ లేని టీ షర్ట్ మీదకు షార్ట్ స్లీవ్స్ ఉన్న టాప్‌ని ఇలా సింపుల్‌గా షగ్‌న్రి తయారుచేసుకోవచ్చు. ముందు ఫ్యాబ్రిక్ మార్కర్ లేదా స్కెచ్ పెన్నుతో నెక్‌తో పాటు ముందుభాగాన్ని ఎంతమేరకు కట్ చేయాలో డ్రా చేసుకోవాలి.
టీ షర్ట్ ముందు భాగంలో మెడ నుంచి కిందవరకు కట్ చేయాలి. మెడ నుంచి కిందవరకు దేనికది విడిభాగాలుగా మడిచి కుట్టాలి. మడిచి కుట్టిన దాంట్లో నుంచి కలర్ శాటిన్ రిబ్బన్‌ను తీయాలి. స్లీవ్‌లెస్ టాప్ వేసుకున్నాక దానికి ఓవర్ టాప్‌గా అమరిపోతుంది. ఓ సరికొత్త స్టైల్ షగ్ ్రమీ వార్డ్‌రోబ్‌లో చేరినట్టే. ఈ షగ్‌న్రి మిగతా టాప్స్‌మీదకు కూడా ధరించవచ్చు.