అక్రమంగా ప్లాటినం అమ్మకానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నంలో మంగళవారం జరిగింది. ఎలాంటి బిల్లులు, అనుమతులు లేకుండా ప్లాటినం అమ్మడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం తో వీరు రాజు అనే వ్యక్తికి లోహాన్ని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన ప్లాటినంను స్వాధీనం చేసుకున్నారు.