Real Estate Regulatory Act
-
అసంపూర్తి నిర్మాణాలకు మళ్లీ జీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్‌ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్‌లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి. ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్‌లో ప్లాటినం పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్‌లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్‌కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది. 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్మెంట్లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది. కస్టమర్లకు ఊరట లభిస్తుంది పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు -
కౌన్ బనేగా ‘రెరా’ చైర్మన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్‌లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఎంపిక ఎలా ఉంటుందంటే.. టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్‌గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్‌గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్లోనే.. స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్‌లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. -
Telangana: రెరా లేకుండానే విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, పెట్టుబడులకు రక్షణ కల్పించే టీఎస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) లక్ష్యానికి కొందరు డెవలపర్లు తూట్లు పొడుస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్) కింద య«థేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. కొందరు డెవలపర్లయితే స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. తనది కాని స్థలంలో ఆకాశహర్మ్యం నిర్మిస్తామని మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రతిపాదిత హెచ్ఎండీఏ అనుమతులు అని బ్రోచర్లో ముద్రించి యూడీఎస్ కింద విక్రయాలనే చేస్తోంది కరోనా సమయంలో పుట్టుకొచ్చిన ఓ నిర్మాణ సంస్థ. మేడ్చల్‌లో 3.04 ఎకరాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ప్రకటించింది. 1,100 నుంచి 1,525 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 273 రెండు, మూడు పడక గదులను నిర్మిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు నిర్మాణ అనుమతులు రాలేదు, టీఎస్ రెరాలో నమోదు కాకుండానే 60–80 వరకు గృహాలను విక్రయించడం గమనార్హం. విక్రయ ధర కూడా వేర్వేరుగా ఉంటుందట. రెగ్యులర్ ధర రూ.3,499 కాగా.. ఆఫర్ కింద రూ.2,200కే విక్రయిస్తుందంట. అంటే 2 బీహెచ్‌కే ధర రూ.24.20 లక్షలు. అదే బ్యాంక్ రుణం ద్వారా కొనుగోలు చేస్తే.. చ.అ.కు రూ.2,600 అంట. 2 బీహెచ్కేకు రూ.28.60 లక్షలు అవుతుంది. ఇందులోను 50 శాతం ముందస్తు సొమ్ము చెల్లించాలని, మిగిలిన సొమ్ముకు మాత్రమే లోన్‌కు వెళ్లాలనే షరతు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. -
రెరాతో ఇన్వెంటరీ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ)లకు రెక్కలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాచింగ్స్ కంటే ఇన్వెంటరీ అమ్మకాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే? ప్రాజెక్ట్ ప్రారంభిస్తే చాలు రెరాలో నమోదు, నాణ్యత, నిర్మాణ గడువు, నిర్వహణ ప్రతి అంశంలోనూ కఠినమైన నిబంధనలుండటంతో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో 8,90,719 గృహాల ఇన్వెంటరీ ఉంటే 2018–19 క్యూ4 నాటికి 8,00,438 గృహాలకు చేరాయి. అంటే ఏడాదిలో 10 శాతం తగ్గాయని ప్రాప్‌టైగర్.కామ్ ‘‘రియల్ ఎస్టేట్: 2018–19 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)’’ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్, చెన్నై మినహా.. అహ్మదాబాద్, చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇన్వెంటరీ తగ్గింది. అహ్మదాబాద్‌లో 2018 క్యూ4లో 61,683 గృహాలుండగా.. 2019 క్యూ4 నాటికి 63,114 యూనిట్లకు, చెన్నైలో 37,728 నుంచి 38,226 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 87,110 నుంచి 77,835 యూనిట్లకు, గుర్గావ్లో 47,793 నుంచి 44,046 గృహాలకు, కోల్‌కతాలో 48,629 నుంచి 44,689లకు, ముంబైలో 3,32,719 నుంచి 2,88,679లకు, నోయిడాలో 79,605 నుంచి 65,006లకు, పుణేలో 1,53,182 నుంచి 1,41,695లకు తగ్గాయి. హైదరాబాద్ రియల్టీ టాప్‌గేర్ హైదరాబాద్ రియల్టీ రంగం టాప్‌గేర్‌లో పడింది. బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ఇతర మెట్రో నగరాల్లోని గృహాల అమ్మకాల్లో కనిపించని వృద్ధి భాగ్యనగరంలోనే జరిగింది. 2018–19 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో నగరంలో 7,059 గృహాలు అమ్ముడయ్యాయి. 2017–18 క్యూ4తో పోలిస్తే 26 శాతం వృద్ధి. 2018 క్యూ4లో 5,618 గృహాలు విక్రయమయ్యాయి. ఇక, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్లను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 6,285 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4లో 3 శాతం క్షీణించి 6,066లకు తగ్గాయి. ఇన్వెంటరీలను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 42,270 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. 2019 క్యూ4 నాటికి 35,148 యూనిట్లకు తగ్గాయి. అంటే ఏడాదిలో 17 శాతం తగ్గిందన్నమాట. అద్దెల విషయంలోనూ అంతే! హైదరాబాద్‌లో మినహా అన్ని నగరాల్లో ఏడాదిలో అద్దెలు 14 శాతం పెరిగాయి. -
రిజిస్ట్రేషన్ శాఖతో రెరా అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారులకు భరోసా కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రధాన లక్ష్యం. రెరాలో నమోదు చేయకుండా విక్రయించే ప్రాజెక్ట్‌లను, ప్రమోటర్లను, ఏజెంట్లను గుర్తించేందుకు అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏల నుంచి అనుమతి తీసుకోగానే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసిన టీ–రెరా.. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ మీద కన్నేసింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా సరే చివరికి రిజిస్ట్రేషన్ శాఖ వద్దకు రావాల్సిందే! ఇక్కడే టీ–రెరా వల వేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ వివరాలు టీ–రెరాకు అందుబాటులో ఉండేలా.. శాఖకు లేఖ రాయనుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ, టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖ.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుమతులు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుంది. అంతిమంగా కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ, తెలంగాణలో 20 శాతం మంది ప్రమోటర్లు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, పారదర్శకంగా ఉండాలని రెరాలో నమోదు చేశాకే విక్రయాలు జరుపుతుంటే.. 80 శాతం మంది మాత్రం కొనుగోలుదారులకు మాయమాటలు, రకరకాల ఆఫర్లతో మోసపూరితంగా అమ్మకాలు చేస్తున్నారని టీ–రెరా పరిశీలనలో తేలింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా, ఎవరు ఎవరితో క్రయ విక్రయాలు జరిపినా సరే అంతిమంగా రిజిస్ట్రేషన్ శాఖకు రావాల్సిందే కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ, టీ–రెరా సమన్వయంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ వివరాలు తెలిసేలా రెండు విభాగాలను అనుసంధానించనున్నారు. ప్రతి డాక్యుమెంట్, ప్రాజెక్ట్‌ను రెరా అధికారులు భౌతికంగా పరిశీలించి, రెరాలో నమోదు అయిందా? లేదా? చెక్ చేస్తారు. ఒకవేళ టీ–రెరాలో నమోదు అర్హత ఉండి కూడా రిజిస్టర్ కాకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. సర్వం టీ–రెరా చేతిలో.. టీ–రెరా, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వంగా పనిచేస్తే.. ప్రమోటర్ ఫొటో, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, చిరునామా వంటి సమాచారంతో పాటూ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ప్లాటింగ్ ఏరియా, ప్రాజెక్ట్ వ్యయం, విక్రయ ధర వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికే టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రతి ప్రాజెక్ట్, ప్రమోటర్లను గుర్తించేందుకు మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ విభాగాలతో కలిసి పనిచేస్తుమన్నాని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయా విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్/ లే అవుట్ సమాచారాన్ని తెప్పించుకొని, భౌతికంగా పరిశీలన చేస్తుమన్నాని చెప్పారు. గడువులోగా రెరాలో నమోదు చేసుకుంటే ఓకే! లేకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. సాక్షి: రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి? రెరా: 4634 ప్రమోటర్లు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఇందులో 2039 మంది ఏజెంట్లు, 2595 ప్రాజెక్ట్ ప్రమోటర్లు ఉన్నారు. సాక్షి: స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే మీ సూచన? రెరా: ఏజెంట్లు, ప్రమోటర్లు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి లేదా బ్రోచర్లు ఇచ్చి మా ప్రాజెక్ట్‌లో కొనండి అంటే ముందుగా వాళ్లని అడగాల్సిన మొదటి ప్రశ్న.. మీరు రెరాలో నమోదు అయిన ఏజెంటేనా అని! రెండో ప్రశ్న.. సంబంధిత ప్రాజెక్ట్‌లో రెరాలో నమోదు అయిందా అని! వీటికి సమాధానం అవునొస్తే ముందడుగు వేయవచ్చు. సాక్షి: ఒకవేళ రెరా ఏజెంట్ అని, నంబరు ఉందని తప్పుడు సమాచారం ఇస్తే? రెరా: రెరా వెబ్సైట్లో రెరా నంబరు, ఏజెంట్ల వివరాలను నిర్ధారించుకునే వీలుంది. ట్ఛట్చ.్ట్ఛ ్చnజ్చ n్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లగానే సెర్చ్ రిజిస్టర్ ప్రాజెక్ట్ అండ్ ఏజెంట్ అనే అప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ప్రత్యేకంగా లింక్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రాజెక్ట్, ప్రమోటర్ పేరు, ఏజెంట్ల నంబర్లు నమోదు చేస్తే చాలు వివరాలన్నీ క్షణాల్లో మీ ముందుంటాయి. సాక్షి: హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఉంది. కానీ, రెరా రిజిస్టర్ కాదు? ఆ ప్రాజెక్ట్‌లో కొనొచ్చా? రెరా: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, కార్పొరేషన్, పంచాయతీ ఏ విభాగం నుంచి అయినా అపార్ట్మెంట్ లేదా లే అవుట్ అనుమతి తీసుకున్నా సరే రెరాలో నమోదు చేయకుండా విక్రయాలు జరపకూడదు. ప్రకటనలు కూడా చేయకూడదు. అలా చేస్తే రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయి. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన, 9 ఫ్లాట్లు లేదా 501 చ.మీ. నుంచి ప్రారంభమయ్యే ప్రతి అపార్ట్మెంట్, లే అవుట్ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. సాక్షి: రెరా నమోదు గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా డెవలపర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటానికి కారణం? రెరా: టీ–రెరాలో ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని నమోదు చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ప్రమోటర్లు, డైరెక్టర్ల వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు, కంపెనీ అడ్రస్, ఏజెంట్ల వివరాలు ప్రతి ఒక్కటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే డెవలపర్లకు కష్టంగా ఉంది. ఈ వివరాలు రెరాకు ఇస్తే.. లాక్ అయిపోతామని భావిస్తున్నారు. అందుకే తప్పుడు ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నాం. రెరాలో తప్పుడు నంబర్లు ఇస్తే షోకాజ్ నోటీసులు పంపిస్తున్నాం. సరైన సమాచారం ఇవ్వని వాళ్ల మీద జరిమానాలతో పాటూ కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: రెరాలో ప్రాజెక్ట్‌లను నమోదు చేయడంతోనే డెవలపర్ల పని పూర్తయినట్టా? రెరా: అది తప్పు. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ నమోదు చేయడంతోనే డెవలపర్ల అసలు పని మొదలవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రెరాలో ప్రాజెక్ట్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 33 మంది డెవలపర్లకు ప్రాజెక్ట్‌ను అప్డేట్ చేయమని చెప్పాం. రెరా వెబ్సైట్లో స్క్రోల్ కూడా చేస్తున్నాం. అప్డేషన్ ఫీజు ఏడాదికి రూ.500. -
రెరా గడువు మళ్లీ పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల నమోదు గడువును మళ్లీ పొడిగించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, జరిమానా రూ.2 లక్షల చెల్లించి ఈ నెల 15వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఇదే చివరి అవకాశమని.. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 శాతం వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,892 ప్రాజెక్ట్ ప్రమోటర్లు, 1,527 ఏజెంట్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. గడువు పొడిగింపు ఆరోసారి.. టీ–రెరా నమోదు గడువును పొడిగించడం వరుసగా ఇది ఆరోసారి. వాస్తవానికి జనవరి 31తో రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. కానీ, ఆశించిన స్థాయిలో ప్రాజెక్ట్ ప్రమోటర్లు నమోదు కాకపోవటంతో మళ్లీ గడువు తేదీని పొడిగించారు. గతేడాది ఆగస్టు 31న తెలంగాణ రెరా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2017, జనవరి 1 నుంచి 2018, ఆగస్టు 31 మధ్య కాలంలో యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్ రెరాలో నమోదు చేసుకోవాలి. 8 యూనిట్లు లేదా 500 చ.మీ.లో ఉండే ప్రతి అపార్ట్మెంట్, లే అవుట్ రెరాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 39 మందిపై విచారణ షురూ.. కొందరు డెవలపర్లు తప్పుడు సమాచారంతో రెరాలో రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారని, రెరాలో నమోదు చేసుకోకుండానే ప్రకటనలు, విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసిందని విద్యాధర్ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన సుమారు 39 మంది డెవలపర్లకు షోకాజ్ నోటీసులు అందించామని, వారం రోజుల్లోగా వీళ్లందరినీ విచారణకు పిలుస్తామని ఆయన తెలిపారు. విచారణకు హాజరుకాకపోయినా లేక సంతృప్తికరంగా వ్యవహరించకపోయినా సరే సెక్షన్ 59 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని తెలిపారు. -
గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది. జాప్యం చేసే ప్రాజెక్టులపై గృహ కొనుగోలుదారులకు చెల్లించే వడ్డీరేట్టు 10 శాతంగా నిర్ధారించినట్టు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్(ఆర్ఈఆర్ఏ) తెలిపింది. సేల్స్ అగ్రిమెంట్ లో భాగంగా హౌజింగ్ ప్రాజెక్టులు జాప్యమవుతున్నట్టు తాము పెట్టుబడి పెట్టిన మొత్తంపై కొనుగోలుదారులు ఈ మొత్తాన్ని పొందవచ్చు. అంతకముందు ఒక్కో చదరపు అడుగులకు 5గా ఉన్న రేటు, దీని ప్రకారం ప్రస్తుత రేటు 10గా నిర్ణయించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ చట్టం అమలవుతుందని, మరో 14 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలుచేసే ప్రక్రియ జరుగుతుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ఈ చట్టం కింద ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ వద్ద ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ జూలై ఆఖరికల్లా రిజిస్ట్రర్ చేసుకోవాలని హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఆల్లేవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. ఈ చట్టం ఆపరేటర్ల బారిన పడుతున్న కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. 2016 మార్చిలో ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందగా.. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నోటిఫై అయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీష్ ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఐలాండ్స్, చంఢీఘర్, దాద్రా అండ్ నగేర్ హవేళి, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్ లు ఉన్నాయి. మే 1వరకు కూడా తాము నిర్మించబోయే, నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్ పొందనివారు మూడు నెలల్లో పొందాల్సి ఉంటుందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లాట్లను డెవలపర్లు జూలై వరకు విక్రయించాలని కూడా రెగ్యులేటరీ ఆదేశించింది.