మేడ్చెల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. దుండిగల్ తండా-1కు చెందిన బాల్‌సింగ్, దీప దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాల్‌సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దీపను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు.