husband dies
-
దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి, భార్య పరిస్థితి విషమం తాడిపత్రి : కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన కుళ్లాయప్ప (55), దస్తగిరమ్మ దంపతులు. రెండు రోజుల కిందట భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కుళ్లాయప్ప మంగళవారం విషపుగుళికలు మింగాడు. దీంతో భార్య కూడా ఆ గుళికలను మింగింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుళ్లాయప్ప మృతి చెందాడు. దస్తగిరమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎఐ ఆంజనేయులు కేసు దర్యాప్తుచే స్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి...భార్య పరిస్థితి విషమం
మేడ్చెల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. దుండిగల్ తండా-1కు చెందిన బాల్సింగ్, దీప దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాల్సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దీపను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. -
భర్త వియోగంతో భార్య బలవన్మరణం
రాయదుర్గం రూరల్ : భర్త లేని జీవితం తనకు వద్దని భార్య బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మల్లాపురంలో వెలుగు చూసింది. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురానికి చెందిన గురుప్రపసాద్తో మల్లాపురం సమీపంలోని కుంటు మారెమ్మ గుడివద్ద నివాసముంటున్న శారదకు ఏడాదిన్నర క్రి తం వివాహమైంది. గత నెల ఆరో తేదీన కుంటు మారెమ్మ గుడి సమీపంలో గురుప్రసాద్ ద్విచక్రవాహనంపై అదుపుతప్పి గాయపడ్డాడు. రాయదుర్గం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పదో తేదీ అతను మతి చెందాడు. అప్పటి నుంచి శారద దిగులుతో ఉండేది. ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.