Akbar Khan Electrician Died After Car Hitting Open Plat Wall In Dundigal- Sakshi
Sakshi News home page

ఘోరం: డ్రైవింగ్‌లో ఉండగా ఫిట్స్‌!

Published Mon, Feb 8 2021 2:00 PM | Last Updated on Mon, Feb 8 2021 3:05 PM

Electrician Died After Hitting Prahari In Dundigal - Sakshi

సాక్షి, దుండిగల్‌: వేగంగా కారు నడుపుతున్న వ్యక్తికి ఫిట్స్‌ రావడంతో వాహనం అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుండిగల్‌ మున్సిపల్‌ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్‌ ఖాన్‌(38) ఎలక్ట్రీషియన్ శనివారం రాత్రి ఔటర్‌ నుంచి దుండిగల్‌ వైపు వర్నా కారులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్‌ రావడంతో కారు పక్కనే ఉన్న ఓపెన్‌ ప్లాట్‌ గోడను ఢీకొంది. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement