కబడ్డీ ఆడుతున్న తల్లులు
దుండిగల్: ఆట పాటలతో తల్లిదండ్రులు సందడి చేశారు. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం ‘అమ్మానాన్నల హల్‌చల్’ పేరుతో రెండవ రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ... వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసిన టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈటీ సొసైటీని ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తమ కళాశాలలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు వేదికైందిన్నారు. కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ మామిడాల, అడిషనల్ సెక్రటరీ ఉమాదేవి, రజనీ, వందలాది మంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ ఆడుతున్న తండ్రులు
Comments
Please login to add a commentAdd a comment