దుండిగల్: మహిళను మభ్యపెట్టి యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ శంకర్‌రెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం సుండూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ సమీపంలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త మేస్త్రీ కాగా.. భార్య కూలీ పని చేస్తోంది. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన కత్రివేల్ అనే యువకుడు చింతల్‌లో స్థిరపడి శ్రీరామ్‌నగర్ కాలనీలో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో బాధితురాలి కుటుంబం కత్రీవేల్ వద్ద రూ.9 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇప్పటికే రూ.4,500 తిరిగి చెల్లిం చారు. అయితే ఈ నెల 27న భర్త సొంత గ్రామానికి వెళ్లగా ఇంటికి వచ్చిన కత్రివేల్ బాకీ సొమ్ము చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద డబ్బులు లేవని, తన భర్త వచ్చాకా ఇస్తాడని ఆమె చెప్పింది. అయినా వినకుండా డీపోచంపల్లి సర్వే నెంబర్ 120లో ఉండే ఓ మహిళ అప్పు చెల్లింపునకు మధ్యవర్తిగా ఉంటానని చెప్తే తాను వెళ్లిపోతానని చెప్పి అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమెను తనబైక్ పై ఎక్కించుకెళ్లాడు.
120 ప్రాంతానికి కాకుండా మండల కార్యాలయం సమీపంలో ఉండే స్టేడియం వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి వెళ్లిపోయాడు. ఎలాగోలా ఇంటికి చేరిన బాధితురాలు అప్పుడే వచ్చిన తన భర్తకు జరిగిన విషయా న్ని చెప్పింది. బాధితురాలు బుధవారం భర్తతో కలిసి వచ్చి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.