
భరత్‌భూషణ్ (ఫైల్)
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): మద్యం మత్తులో రక్త సంబంధాన్నే మరిచారు.. తాగిన మైకంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. మత్తులో అన్నపై తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన వాడపల్లి వెంకటమారుతి భరత్‌భూషణ్ (35), సాయితేజ(28)లు అన్నదమ్ములు. వీరికి వివాహాలు కాలేదు.
పనిపాట లేకుండాగా ఇంటి పట్టునే ఉంటూ ప్రతిరోజూ మద్యం తాగి గొడవ పడేవారు. వీరి తల్లికి పక్షపాతం ఉండటంతో కదలలేని స్థితిలో ఉండేది. 24వ తేదీ రాత్రి మద్యం తాగి గొడవ పడ్డారు. తమ్ముడు సాయితేజ కుక్కర్‌తో అన్న భరత్‌భూషణ్‌పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఉదయం అన్నను నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment