హైదరాబాద్ నగర శివారులోని దిండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ను కొట్టింది. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని, దాంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.