Indian Medical Student
-
చైనాలో తమిళనాడు వైద్య విద్యార్థి మృతి.. కరోనానే కారణం?
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. గత ఐదేళ్లుగా చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబం తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు భారత్‌లోని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షేక్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం చైనాకు వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా భారత్ తిరిగివచ్చిన అతను 20 రోజుల క్రితమే(2022 డిసెంబర్ 11)న తిరిగి చైనాకు వెళ్లాడు. 8 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈశాన్య చైనాలోని హెయిలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అతడిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అనారోగ్యంతో తమ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది ఆ కుటుంబం. అలాగే.. తమకు సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి..
మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. కారు సెర్గీవ్ నుంచి సెన్స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చదవండి: అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం -
ఉక్రెయిన్ టూ భారత్: వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం
ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విదేశాలు స్వదేశాలకు తిరుగుపయనమైన విషయం తెలిసిందే. కాగా, భారత్‌కు చెందిన మెడిసిస్ విద్యార్థులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. అయితే, వారు మళ్లీ ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేదు. మరోవైపు.. ఇక్కడ మెడికల్ కాలేజీల్లో, యూనివర్సిట్లీలో ప్రవేశాలు కల్పించాలని నిరసనలు తెలుపుతున్నారు. అటు విద్యార్థుల పేరెంట్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్లారమెంట్స్ సెషన్స్‌లో భాగంగా ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం.. శనివారం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. లోకల్ కాలేజీల్లో అడ్మిషన్లపై ఎన్ఎంసీ(National Medical Commission) ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు బదిలీ చేయడానికి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి ఎన్ఎంసీ నిబంధనలు అంగీకరించవని తెలిపారు. దీంతో, విద్యార్థులకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. స్వదేశమైన భారత్‌లోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. 'No provision' to absorb Ukraine Medical returnees #MBBSCourse #MBBSstudent #MedicalStudent #NationalMedicalCommission #NMC #Ukrainemedicalstudenthttps://t.co/E0vEMxp0fn — The Health Master (@DHealthMaster) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
డాడీ భయంగా ఉంది.. ఇంటికొచ్చేలా చూడండి
యాచారం: ‘డాడీ భయంగా ఉంది. బాంబుల మోతతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నా. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. నన్ను ఎలాగైనా ఇంటికి రప్పించు ప్లీజ్’ అని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థి తన తండ్రితో అన్న మాటలివి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన కాటిక వెంకటయ్య, సుగుణ దంపతుల కుమార్తె కాటిక వెన్నెల వైద్య విద్యను అభ్యసించేందుకు మూడు నెలల కిందట ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడి వినిస్తియా యూనివర్సిటీలో చదువుకుంటోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భయాందోళన చెందుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో తిండీ నిద్ర లేకుండా పోతోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. ప్రాణాలతో బతికి వస్తామోలేదో డాడీ, మమ్మీ అంటూ బోరున విలపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెన్నెలను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 300 మంది విద్యార్థులం వినిస్తియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి సహకారం లేదని, వెళ్లిపోండి.. జాగ్రత్తగా ఉండండి.. బాంబులు ఎప్పుడైనా పడొచ్చని హెచ్చరిస్తున్నట్లు విలపిస్తూ చెప్పింది. -
ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం
Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత పట్టుకుని కాలినడకన పోలాండ్ సరిహద్దుల వెంబడి పయనమయ్యారు. ఈ మేరకు సరిహద్దుకు సుమారు 8 కి.మీ దూరంలో తమ కళాశాల బస్సు నుంచి దిగిన 40 మంది వైద్యా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలాండ్ సరిహద్దుకు వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. పోలాండ్ సరిహద్దుకు సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఎల్వివ్లోని ఒక వైద్య కళాశాల విద్యార్థులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కైవ్‌లోని అడుగు పెట్టేయడమే కాక అక్కడ ఉన్న ఉక్రెయిన్ డిఫెండర్లతో పోరాడుతున్నాయి. మరో రెండు గంటల్లో నగరం రష్యా అధినంలోకి వచ్చే అవకాశం ఉందని ఉక్రెయిన పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత వైద్య విద్యార్థుల పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు వరకు సుదీర్ఘ నడకను సాగించారు. అంతేకాదు కొంతమంది విద్యార్థుల తాము ఉక్రెయిన్‌ని విడిచి కాలినడకన ఒక సముహంగా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారు, పైగా వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. రష్యా బాంబు దాడులు, క్షిపిణి దాడుల భయంతో భూగర్భ మెట్రో స్టేషన్లు, నేల మాళిగలు వంటి షెల్టర్ల నుంచి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీలలో క్యాంపు కార్యాలయాలను ప్రారంభించింది. పోలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులకు సహాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ మరింత మంది రష్యన్ మాట్లాడే అధికారులను ఈ క్యాంపు కార్యాలయాలకు పంపింది. విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు కూడా బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకోగలిగిన భారతీయుల కోసం ప్రభుత్వం విమానాలను పంపించడమే కాక ఈ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు రెండు చార్టర్డ్ విమానాలు ఈరోజు బుకారెస్ట్‌కు బయలుదేరే అవకాశం ఉందని ఒక విమానం రేపు బుడాపెస్ట్‌కు బయలుదేరుతుందని వెల్లడించారు. హంగరీ, రొమేనియాలోని సరిహద్దు చెక్ పాయింట్లకు దగ్గరగా ఉన్నవారు ముందుగా బయలుదేరాలని సూచించారు. విద్యార్థి కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులను కోరింది. (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?) -
భారత్‌కు చేరుకున్న 480 విద్యార్థులు
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రష్యాలో చిక్కుకున్న 480 మంది భారతీయ వైద్య విద్యార్థులు సోమవారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన ముంబై-సౌత్ ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాలో ఉన్న భారత విద్యార్థులు మొదట తనను సంప్రదించారని, దీంతో వారికి మంత్రి ఆదిత్య ఠాక్రేకు ట్వీట్ చేయమని సలహా ఇచ్చానని చెప్పారు. ఇక ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున ప్రోటోకాల్ విభాగానికి బాధ్యత వహించి విద్యార్థులను భారత్‌కు రప్పించారని సావంత్ తెలిపారు. (చదవండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) మహరాష్ట్ర చేరుకున్న 480 విద్యార్థుల్లో 470 మంది మహరాష్ట్ర చేరుకున్నారని, దాద్రా, నగర్ హవేలీకి చెందిన వారు 4, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 4, గోవాకు చెందిన ఇద్దరూ ఉన్నారు. రష్యా నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రతి విద్యార్థికి 400 డాలర్లు (సుమారు రూ. 30,000) ప్రభుత్వం చెల్లించినట్లు నిక్స్టోర్ విమాన ఆన్లైన్ టికెటింగ్ కంపెనీకి చెందిన నికేష్ రంజన్ తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఠాక్రే సహాయం చేశారని, ఇందుకు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ), రాష్ట్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలను సంప్రదించారని రంజన్ పేర్కొన్నారు. (చదవండి: గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) -
ఇండియన్ వైద్య విద్యార్థి హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తనతోపాటే ఉంటున్న ఓ యువకుడు ఓ భారతీయ మెడికల్ విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర కత్తిపోటు గాయాలతో మెడికల్ విద్యార్థి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతీఫ్ షేక్ అనే మెడికల్ విద్యార్థి విన్సన్ మెయిస్నామ్ సింగ్(23) అనే వ్యక్తితో కలిసి ఢాకాలోని అక్బర్ షా అనే ప్రాంతంలోని ఓ ఆరంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. అతడు చిట్టగాంగ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తొలుత సింగ్, అతీఫ్ మధ్య గొడవ ప్రారంభమై అనంతరం కత్తిపోట్ల వరకు దారి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, వీరితోపాటు మరో ఇద్దరు కూడా ఉంటున్నారని చెప్పారు. వారిలో ఒక యువతి కూడా ఉన్నారని తెలిపారు. వీరంతా కూడా మణిపూర్‌కు చెందిన వారని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన అనంతరం సింగ్ ఉరేసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన తోటి ఇద్దరు అతడిని అడ్డుకున్నారని, కత్తిపోట్లకు గురైన అతీఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు వివరించారు.