కాటేసిన కల్తీ మద్యం.. ఏడుగురు మృతి | Liquor Bought From Authorised Shop Claims Six Lives In UP | Sakshi
Sakshi News home page

కాటేసిన కల్తీ మద్యం.. ఏడుగురు మృతి

Published Wed, Jan 26 2022 6:18 PM | Last Updated on Wed, Jan 26 2022 7:33 PM

Liquor Bought From Authorised Shop Claims Six Lives In UP - Sakshi

లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో మద్యం తాగిన వారిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయ్​బేరేలీలోని పహర్​ పూర్​ గ్రామంలో కొంత మంది గ్రామస్తులు మంగళవారం (జనవరి25)న మద్యం తాగారు. వీరంతా స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో వీరికోసం ఒక మద్యం దుకాణం నుంచి తెప్పించిన బీరును తాగారు. ఆ తర్వాత.. వీరంతా అర్థరాత్రి వీరంతా అస్వస్థతకు లోనయ్యారు. వీరికి వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా పహన్​పూర్​ గ్రామానికి చెందిన వారున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సదరు గ్రామానికి చేరుకున్నారు.

బాధితుల పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. మద్యం దుకాణంనుంచి సాంపుల్స్​ సేకరించి పరీక్షల కోసం పంపారు. కాగా, బాధితులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మద్యంషాపు యజమానిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్​ శ్రీవాత్సవ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం లక్నో కమిషనర్​ రంజన్​ కుమార్​ సదరు గ్రామానికి చేరుకున్నారు.

మద్యం తాగిన ఘటనలో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. మరికొందరికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో.. సుఖ్రాణి(65), రామ్​సుమేర్​(50), సరోజ్​(40), బన్సీ(55) వారు ఉన్నట్లు గుర్తించారు. మరికొందరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరంతా కల్తీ మద్యం తాగి మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: రిపబ్లిక్​ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement