Odisha Train Tragedy: 1st Vande Bharat High Speed Train Crosses Odisha Rail Tragedy Site - Sakshi
Sakshi News home page

Odisha Rail Tragedy: ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతం గుండా.. వందే భారత్‌ రైలు..

Published Mon, Jun 5 2023 1:15 PM | Last Updated on Mon, Jun 5 2023 1:45 PM

1st Vande Bharat High Speed Train Crosses Odisha Rail Tragedy Site - Sakshi

ఒడిశా రైలు ప్రమాదం ఎంతటీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత ఆ ప్రాంతం గుండా తొలిసారిగా వందే భారత్‌ హైస్పీడ్‌ ప్యాసింజర్‌ హౌరా పూరీ రైలు వెళ్లింది. ఆ ప్రమాదం తర్వాత... పట్టాలు పునరుద్ధరణ పనులు పూర్తవ్వడంతో.. ఈ ఉదయమే బాలాసోర్‌ గుండా వందే భారత్‌ రైలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు . ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు బహనాగ బజార్‌ స్టేషన్‌ను దాటినట్లు తెలిపారు.

అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా ప్రమాద స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ వందే భారత్‌ రైలు వెళ్లినప్పుడూ.. అందులోని డ్రైవర్లకు వైష్ణవ్‌ చేయి చూపినట్లు అధికారులు తెలిపారు. ఆ పట్టా పునురుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తయినట్లు వైష్ణవ్‌ తెలిపారు.

ఆదివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్‌ పోర్టు నుంచి బొగ్గుతో కూడిన రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ రైలు ఆ ట్రాక్‌పై పరుగులు పెట్టినట్లు తెలిపారు అధికారులు. కాగా ఆ మూడు రైళ్ల ప్రమాదం విషయమై ఇది మానవ తప్పిదమా? ..సిగ్నల్‌ వైఫల్యమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement