
పటాన్‌చెరు టౌన్: న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద జరిగిన ఈవెంట్‌కి హాజరై తిరిగి హాస్టల్‌కు వెళ్తుండగా స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్‌చెరు శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
పటాన్‌చెరు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు... సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్ పరిధిలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్‌లో పర్మిషన్ తీసుకుని ఆదివారం సాయంత్రం మూడు బైక్‌లపై దుర్గం చెరువు ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పటాన్‌చెరు శివారు వాల్యూమాట్ సమీపంలోకి రాగానే భరత్ చందర్ (19) నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు.
ఈ ఘటనలో భరత్ చందర్‌తో పాటు వెనుక కూర్చున్న స్నేహితుడు నితి న్ (18) అక్కడికక్కడే మృతి చెంద గా, మరో స్నేహితుడు వర్షిత్ (19) కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భరత్ చందర్ స్వస్థ లం జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామం. నితిన్ ది అదే జిల్లా బచ్చన్నపేట మండ లంలోని అలింపురం. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment