న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోగల ఓ స్టడీ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి చేరిన వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ సంఘటన అనంతరం విద్యార్థులు అటు కోచింగ్ సెంటర్‌పైన, ఇటు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెంట్‌లో ముగ్గురు మాత్రమే కాదు ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు మృతిచెంది ఉంటారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు. ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్నారు. అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతుందన్నారు. దీంతో అప్పుడప్పుడు విపత్తులు జరుగుతుంటాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల వాస్తవ సంఖ్యను వెంటనే వెల్లడించాలని ఆ విద్యార్థి కోరాడు.
#WATCH | Old Rajender Nagar incident | Delhi: "MCD says it is a disaster but I would say that this is complete negligence. Knee-deep water gets logged in half an hour of rain. Disaster is something that happens sometimes. My landlord said that he had been asking the councillor… pic.twitter.com/W4fhem3lE6
— ANI (@ANI) July 28, 2024
ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన ఘటనపై ట్విట్టర్‌లో సమాచారాన్ని పంచుకున్న ఢిల్లీ పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థి అమన్ శుక్లా మాట్లాడుతూ ముందుగా బేస్‌మెంట్లలో అక్రమంగా నిర్మించిన లైబ్రరీని మూసివేయాలన్నారు.
#WATCH | Old Rajender Nagar Incident | "Three people have died. Why will we hide anything? We assure you that we will do whatever is legally possible. The investigation is on...," says Additional DCP Sachin Sharma to protesting students
3 students lost their lives after the… pic.twitter.com/V82Xq21mQ7— ANI (@ANI) July 28, 2024
Comments
Please login to add a commentAdd a comment