claimed
-
Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోగల ఓ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి చేరిన వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ సంఘటన అనంతరం విద్యార్థులు అటు కోచింగ్ సెంటర్‌పైన, ఇటు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్మెంట్లో ముగ్గురు మాత్రమే కాదు ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు మృతిచెంది ఉంటారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు. ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్నారు. అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతుందన్నారు. దీంతో అప్పుడప్పుడు విపత్తులు జరుగుతుంటాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల వాస్తవ సంఖ్యను వెంటనే వెల్లడించాలని ఆ విద్యార్థి కోరాడు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: "MCD says it is a disaster but I would say that this is complete negligence. Knee-deep water gets logged in half an hour of rain. Disaster is something that happens sometimes. My landlord said that he had been asking the councillor… pic.twitter.com/W4fhem3lE6— ANI (@ANI) July 28, 2024 ఓల్డ్ రాజేంద్ర నగర్లో జరిగిన ఘటనపై ట్విట్టర్లో సమాచారాన్ని పంచుకున్న ఢిల్లీ పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థి అమన్ శుక్లా మాట్లాడుతూ ముందుగా బేస్మెంట్లలో అక్రమంగా నిర్మించిన లైబ్రరీని మూసివేయాలన్నారు. #WATCH | Old Rajender Nagar Incident | "Three people have died. Why will we hide anything? We assure you that we will do whatever is legally possible. The investigation is on...," says Additional DCP Sachin Sharma to protesting students3 students lost their lives after the… pic.twitter.com/V82Xq21mQ7— ANI (@ANI) July 28, 2024 -
రూ. కోటి ఇవ్వు లేదా చంపేస్తాం: గ్యాంగ్‌స్టర్
జైపూర్: సినిమాల్లో విలన్ల మాదిరే నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్న సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. చంపుతామనని బెదిరించే వారు కూడా ఉంటారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఓ గ్యాంగ్‌స్టర్ బిల్డర్‌ని బెదిరిస్తున్నాడు.(చదవండి: సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే) వివరాల్లోకెళ్లితే.. జైపూర్‌కు చెందిన బిల్డర్ నిశ్చల్ భండారికి కొన్ని రోజుల క్రితం ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. సదరు వ్యక్తి తన పేరు లారెన్స్ బిష్ణోయ్ అని, తీహార్ జైలు నుంచి ఫోన్ చేస్తున్నాని చెప్పాడు. తనకు కోటి రూపాయలు కావాలని రెండు రోజుల్లోగా ఆ మొత్తాన్ని రెడీ చేయాలని హెచ్చరించాడు. సదరు బిల్డర్ ఇంటి చుట్టూ తన మనుషులు ఉన్నారని ఈ విషయం పోలీసులకు చెప్పే సాహసం చెయ్యెద్దంటూ బెదిరించాడు. ఈ క్రమంలో నిశ్చల్ భండారికి సెప్టెంబర్ 9న ఆ అపరిచిత వ్యక్తి నుంచి మరోసారి కాల్ వచ్చింది. కానీ భయంతో సదరు బిల్డర్ కాల్ రీసివ్ చేసుకోలేదు. దాంతో వేరువేరు వాట్సప్ నెంబర్లతో మెసెజ్‌లు, ఫోన్ కాల్స్ చేశాడు నిందితుడు. ఆఖరికి బిల్డర్ నిశ్చల్ భండారి భయంతో శుక్రవారం పోలీస్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పాడు. నిందితుడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించమంటూ పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.(చదవండి: "యూ బ్లడీ ఫూల్" అంటూ.. మాట్లాడుతున్న బాతులు) -
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన గణనాధుడు
-
లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న పెట్రో ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు. లీటరుకు ఒకటి లేదా రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. తమ ఖజానా నింపుకునేందుకు సాధారణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని వేస్తోందని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి లీటరుపై రూ. 25 బొనాంజా అంటూ బుధవారం ఆయన వరుస ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూనుకుంటే లీటరుకు 25 రూపాయల దాకా తగ్గించే అవకాశం ఉందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని, ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్‌ను విధిస్తుందని చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. తద్వారా ప్రతి లీటరుపై రూ.25 కేంద్రానికి ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఆదా అయిన డబ్బు అంతా సగటు వినియోగదారుడికే చెందాలని ఆయన వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రభుత్వం ప్రతి లీటరుపై సుమారు రూ.25 తగ్గించవచ్చు అని, కానీ ప్రభుత్వం అలా చేయదు, కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చిదంబరం విమర్శించారు. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 Bonanza to central government is Rs 25 on every litre of petrol. This money rightfully belongs to the average consumer. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 -
యెమెన్ ఆత్మాహుతి దాడుల్లో 43 మంది మృతి
ముకల్లాః యెమెన్ లో ఉగ్రమూక మళ్ళీ రెచ్చిపోయింది. సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. సుమారు ఏడుచోట్ల ఏకకాలంలో సూసైడ్ బాంబర్లు జరిపిన దాడుల్లో 43 మంది మరణించగా... పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. యెమెన్ ముకల్లా నగరంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్ళలో 43 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాంబర్లు ముకల్లా నగరంలోని ఏడుచోట్ల దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యాధికారులే లక్ష్యంగా బాంబర్లు నిఘా కార్యాలయాలు, ఆర్మీ చెక్ పాయింట్స్, బరాక్ లపై దాడులు జరుపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జరిగిన పేలుళ్ళలో పేలుడు పదార్థాలను ఆత్మాహుతి దళాలు రంజాన్ ఉపాహారాలకు సంబంధించిన ఫుడ్ బాక్స్ లో పెట్టి తెచ్చినట్లుగా ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఇదిలా ఉంటే యెమెన్ లో తాజాగా జరిగిన దాడులు తమపనేనని ఐసిస్ ప్రకటించింది. -
ముస్లిం మహిళా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: యుద్ధ సమయంలో ముస్లిం మతానికి చెందిన పురుషులు, ముస్లిమేతర మహిళలపై అత్యాచారాలు చేయడం చట్టబద్ధమని ఇస్లామిక్ మహిళా ప్రొఫెసర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈజిప్ట్‌లోని కైరో, ప్రఖ్యాత అల్ అజహర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సాద్ సాలెహ్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధమైన యుద్ధాన్ని కొనసాగించేటపుడు ముస్లిం మత పురుషులు బానిస స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే అని ఆమె అన్నారు. దీన్ని అల్లా కూడా అంగీకరిస్తారని, అయితే ఇజ్రాయెల్‌కు, వారి శత్రువులకు మధ్య జరిగే 'చట్టబద్ధమైన యుద్ధం' సమయంలో మాత్రమే ఇది వర్తిస్తుందని సాద్ సాలెహ్ పేర్కొన్నారు. యుధ్ద సమయంలో బానిసలుగా ఉన్న మహిళా ఖైదీలను కించపరిచి హింసించడంకన్నా, వారిని లొంగదీసుకుని, సొంత ఆస్తిలాగా భావించడం సరైందన్నారు. ఆ సమయంలో వారు ముస్లిం మత సైన్యం కమాండర్ ఆస్తిగా మారతారన్నారు. ఈ క్రమంలో వారు భార్యలతో సమానంగా ఆ మహిళలతో లైంగిక సంబంధాలను కలిగి వుండొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ముస్లిం మత పెద్దలు సహా పలువురు సభ్యులు సాద్ సాలెహ్ వాదనలను ఖండించారు. ఇస్లాం మతంపై తప్పుడు వ్యాఖ్యానాలు చేశారని మండిపడ్డారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు.