ముకల్లాః యెమెన్ లో ఉగ్రమూక మళ్ళీ రెచ్చిపోయింది. సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. సుమారు ఏడుచోట్ల ఏకకాలంలో సూసైడ్ బాంబర్లు జరిపిన దాడుల్లో 43 మంది మరణించగా... పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
యెమెన్ ముకల్లా నగరంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్ళలో 43 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాంబర్లు ముకల్లా నగరంలోని ఏడుచోట్ల దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యాధికారులే లక్ష్యంగా బాంబర్లు నిఘా కార్యాలయాలు, ఆర్మీ చెక్ పాయింట్స్, బరాక్ లపై దాడులు జరుపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జరిగిన పేలుళ్ళలో పేలుడు పదార్థాలను ఆత్మాహుతి దళాలు రంజాన్ ఉపాహారాలకు సంబంధించిన ఫుడ్ బాక్స్ లో పెట్టి తెచ్చినట్లుగా ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఇదిలా ఉంటే యెమెన్ లో తాజాగా జరిగిన దాడులు తమపనేనని ఐసిస్ ప్రకటించింది.
యెమెన్ ఆత్మాహుతి దాడుల్లో 43 మంది మృతి
Published Tue, Jun 28 2016 6:40 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement