మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ‘ఓ విషాదం’గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు! ‘‘ఉక్రెయిన్ ప్రజలను మేమెప్పుడూ మా సోదరులుగానే చూశాం. ఇప్పటికీ అలాగే చూస్తున్నాం. ఇప్పుడక్కడ జరుగుతున్నది కచ్చితంగా విషాదమే’’ అని అంగీకరించారు. ఏకపక్షంగా కయ్యానికి కాలు దువ్వి 9 నెలలుగా ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తున్న ఆయన బుధవారం అత్యున్నత సైనికాధికారులతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలే తప్ప తాము కాదని చెప్పుకొచ్చారు.
లక్ష్యాలు సాధించేదాకా ముందుకే వెళ్లి తీరతామని పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యా సైన్యం సంఖ్యను ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ ప్రకటించారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది స్వచ్ఛంద, కాంట్రాక్టు సైనికులుంటారన్నారు. ఫిన్లండ్, స్వీడన్‌లకు చెక్ పెట్టేందుకు పశ్చిమ రష్యాలో నూతన సైనిక విభాగాలను నెలకొల్పుతామని షొయిగూ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment