కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్‌లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW
— Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023
విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y
— Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023
ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
#NepalPlaneCrash
— Rukhsar (@Rukhsar987) January 15, 2023
Prayers! pic.twitter.com/pn7ECs1Gyk
काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2
— Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023
చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!
Comments
Please login to add a commentAdd a comment