
బాలుడు సన్ని
సాక్షి, దుగ్గొండి (వరంగల్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో ఆదివారం సీతాఫలాల కోసం వెళ్లి బాలుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన జమలాపురం శ్రీనివాస్– మమత దంపతుల కుమారుడు సన్ని(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి సమీపంలోని జమలాపురం చిన్న సాంబయ్య ఇంటి ప్రహరీ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుపై పండ్లు కోయడానికి గోడ ఎక్కాడు, కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి పెల్లలు సన్నిపై పడ్డాయి.
దీంతో తీవ్రగాయాలైన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద బాలుడి తల్లిదండ్రులు శ్రీనివాస్–మమత రోదనలు కంటతడిపెడుతున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment